చింతకాయ మెంతికూర పచ్చడి | Tender tamarind fenugreek chutney Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  7th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tender tamarind fenugreek chutney  recipe in Telugu,చింతకాయ మెంతికూర పచ్చడి, Sree Vaishnavi
చింతకాయ మెంతికూర పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    8

    జనం

0

0

చింతకాయ మెంతికూర పచ్చడి వంటకం

చింతకాయ మెంతికూర పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tender tamarind fenugreek chutney Recipe in Telugu )

  • పచ్చి చింతకాయలు 1 1/2 కప్
  • మెంతి కూర 1 కట్ట
  • పచ్చిమిర్చి 6-8
  • మెంతులు 1/2 చెంచా
  • ఎండుమిర్చి 3-4
  • కొత్తిమీర 1 కట్ట
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • ఇంగువ 1/2 చెంచా
  • నూనె 4 చెంచాలు
  • పసుపు చిటికెడు
  • ఉప్పు తగినంత

చింతకాయ మెంతికూర పచ్చడి | How to make Tender tamarind fenugreek chutney Recipe in Telugu

  1. ముందుగా చింతకాయలని శుభ్రంగా కడుగుకొని ముక్కలు చేసుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి నూనె వేసి కాగనివ్వాలి
  3. అందులో మెంతులు ఆవాలు జీలకర్ర ,ఇంగువ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించాలి
  4. వేగిన తరువాత అందులో మెంతికూర, పసుపు వేసి వేయించాలి
  5. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ వేయించిన మిశ్రమం ఉప్పు, చింతకాయ, కొత్తిమీర కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ చేసుకోవాలి
  6. ఇప్పుడు మళ్ళి స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి ఆవాలు వేసి వేయించి పచ్చడిలో వేసుకోవడమే

Reviews for Tender tamarind fenugreek chutney Recipe in Telugu (0)