హోమ్ / వంటకాలు / బీరకాయ టమాటో చట్నీ

Photo of Ridgeguard Tomato Chutney by Pravallika Srinivas at BetterButter
46
2
0.0(0)
0

బీరకాయ టమాటో చట్నీ

Oct-07-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరకాయ టమాటో చట్నీ రెసిపీ గురించి

బీరకాయ లోని పీచు టమాటో లోని సి విటమిన్ కలిపి బీరకాయ చెక్కుతో సహా కలిపి తయారు చేసిన ఒక రుచికరమైన పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. బీరకాయలను - 250gms
  2. టమాటాలు - 2
  3. ఉప్పు - 1 tbsp
  4. పసుపు - 1/4 tbsp
  5. పచ్చిమిర్చి - 10
  6. చింతపండు - నిమ్మపండు అంత
  7. జీలకర్ర - 1/2 tbsp
  8. ఆవాలు - 1 /2 tbsp

సూచనలు

  1. ముందుగా బీరకాయలను కడిగి పీచు తీసివేయాలి. చెక్కుతో సహా కలిపి ముక్కలు చేసుకోవాలి. టమాటాలు కూడా ముక్కలుగా తరుగుకోవాలి. పచ్చిమిర్చి తొడిమలు తీసి మధ్యకు తుంచుకోవాలి.
  2. ఒక కడాయి పెట్టి నూనె వేసి కాగాక జీలకర్ర , ఆవాలు వేసి చిటపటలాడాక తరిగిన బీరకాయ, పచ్చిమిరపకాయలు, టొమాటోలు వేసి కలుపుకోవాలి. పైనుండి ఉప్పు పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచం చింతపండు వేసి మూత పెట్టి సన్నని సెగపై మగ్గనివ్వాలి.
  3. ముక్కలు అన్నీ మెత్తపడ్డాక చల్లారనివ్వాలి. తర్వాత రోట్లో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. అంతే రుచికరమైన బీరకాయ టమాటో పచ్చడి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర