క్యాబేజి పచ్చడి | Cabbage Chutney Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  7th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Cabbage Chutney recipe in Telugu,క్యాబేజి పచ్చడి, Pravallika Srinivas
క్యాబేజి పచ్చడిby Pravallika Srinivas
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

క్యాబేజి పచ్చడి వంటకం

క్యాబేజి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cabbage Chutney Recipe in Telugu )

  • క్యాబేజి - 200gms
  • జీలకర్ర - 1 tbso
  • ఆవాలు - 1 tbsp
  • టమాటో - 1
  • పచ్చిమిర్చి - 10
  • చింతపండు - 4 రెబ్బలు
  • ధనియాలు - 1 tbsp
  • పసుపు - 1/4 tbsp
  • ఉప్పు - 1 tbsp

క్యాబేజి పచ్చడి | How to make Cabbage Chutney Recipe in Telugu

  1. ముందుగా క్యాబేజి ని కడిగి తరిగి పెట్టుకోవాలి. చింతపండు ని వేడి నీటిలో నానపెట్టుకోవాలి. కడాయి పెట్టి నూనె వేసి కాగాక జీలకర్ర, ఆవాలు ,ధనియాలు, తరిగిన క్యాబేజి, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ,ఉప్పు ,పసుపు వేసి కలుపుకోవాలి. కడాయి మీద మూత పెట్టి సన్నని మంట పైన మగ్గనివ్వాలి.
  2. క్యాబేజి ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి. రోట్లో మగ్గిన క్యాబేజి , నానిన చింతపండు రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
  3. తయారైన క్యాబేజి పచ్చడి ని గిన్నిలో లో తీస్కొని పైన కొత్తిమీర వేసుకోవాలి. అంతే క్యాబేజి చట్నీ రెడీ .

నా చిట్కా:

ఇష్టం ఉంటే ఇంగువ పోపు వేసి కలుపుకోవాలి

Reviews for Cabbage Chutney Recipe in Telugu (0)