బీట్రూట్ కొబ్బరి పచ్చడి | Beetroot coconut Pickle Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  7th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Beetroot coconut Pickle recipe in Telugu,బీట్రూట్ కొబ్బరి పచ్చడి, Pravallika Srinivas
బీట్రూట్ కొబ్బరి పచ్చడిby Pravallika Srinivas
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

బీట్రూట్ కొబ్బరి పచ్చడి వంటకం

బీట్రూట్ కొబ్బరి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Beetroot coconut Pickle Recipe in Telugu )

  • బీట్రూట్ - 1
  • పచ్చి కొబ్బరి తురుము - అరచిప్ప
  • నూనె - 3 tbsp
  • పోపు దినుసులు - 1 tbsp
  • ఎండుమిరపకాయలు - 2
  • ఇంగువ - 1/4 tbsp
  • కర్వేపాకు - 1 రెమ్మ
  • ఉప్పు - 1/2 tbsp
  • పసుపు - 1/4 tbsp

బీట్రూట్ కొబ్బరి పచ్చడి | How to make Beetroot coconut Pickle Recipe in Telugu

  1. ముందుగా బీట్రూట్ ని కడిగి తొక్క తీసి ముక్కలుగా తరుగుకోవాలి . కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు, కర్వేపాకు,ఇంగువ,ఎండుమిరపకాయలు , వేసి చిటపటలాడాక తరిగిన బీట్రూట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ,ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. అవసరం అయితే కొంచం నీరు వేయచ్చు. చివరిగా కొబ్బరి తురుము కూడా వేసి కలిపి మగ్గనివ్వాలి.
  2. మగ్గిన మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సర్ జార్ లో బీట్రూట్ మిశ్రమం, ఉప్పు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. అంతే రుచికరమైన బీట్రూట్ కొబ్బరి పచ్చడి రెడీ

నా చిట్కా:

కొబ్బరి ముక్కలు వేసినట్టు అయితే ముందుగా నూనె లో పచ్చివాసన పోయేవరకు వేయించి పక్కన పెట్టి గ్రైండ్ చేసేటపుడు కలుపుకోవాలి.

Reviews for Beetroot coconut Pickle Recipe in Telugu (0)