హోమ్ / వంటకాలు / బీట్రూట్ కొబ్బరి పచ్చడి

Photo of Beetroot coconut Pickle by Pravallika Srinivas at BetterButter
403
0
0.0(0)
0

బీట్రూట్ కొబ్బరి పచ్చడి

Oct-07-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీట్రూట్ కొబ్బరి పచ్చడి రెసిపీ గురించి

బీట్‌ రూట్‌ లో నైట్రేట్‌ల నిల్వలు అధికం. ఇవి నైట్రేట్‌ ఆక్సైడ్‌ లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. బీట్రూట్ - 1
  2. పచ్చి కొబ్బరి తురుము - అరచిప్ప
  3. నూనె - 3 tbsp
  4. పోపు దినుసులు - 1 tbsp
  5. ఎండుమిరపకాయలు - 2
  6. ఇంగువ - 1/4 tbsp
  7. కర్వేపాకు - 1 రెమ్మ
  8. ఉప్పు - 1/2 tbsp
  9. పసుపు - 1/4 tbsp

సూచనలు

  1. ముందుగా బీట్రూట్ ని కడిగి తొక్క తీసి ముక్కలుగా తరుగుకోవాలి . కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు, కర్వేపాకు,ఇంగువ,ఎండుమిరపకాయలు , వేసి చిటపటలాడాక తరిగిన బీట్రూట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ,ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. అవసరం అయితే కొంచం నీరు వేయచ్చు. చివరిగా కొబ్బరి తురుము కూడా వేసి కలిపి మగ్గనివ్వాలి.
  2. మగ్గిన మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సర్ జార్ లో బీట్రూట్ మిశ్రమం, ఉప్పు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. అంతే రుచికరమైన బీట్రూట్ కొబ్బరి పచ్చడి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర