హోమ్ / వంటకాలు / సీమ చింతకాయ ఆవకాయ

Photo of Madras Thorn / Jungle Jalebi pickle  by Swapna Tirumamidi at BetterButter
441
5
0.0(0)
0

సీమ చింతకాయ ఆవకాయ

Oct-08-2018
Swapna Tirumamidi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సీమ చింతకాయ ఆవకాయ రెసిపీ గురించి

సీమ చింతకాయ ఆవకాయ అనగానే కొంత వింతగా,కొంత ఆచర్యంగా అనిపించడం సహజమే....కానీ ఒక్కసారి రుచి చూసాక అయ్యో ఇన్నాళ్లు మనం ఎందుకు చేసుకోలేదా అనిపిస్తుంది....అవకాయల సీజన్ రాగానే మామిడికాయలు కోసం ఎలా ఎదురుచూస్తామో....అలాగే ఇక నుంచి సీమ చింతకాయల కోసం కూడా ఎదురు చూస్తుంటారు మీరు....ఊరగాయ ప్రియులకి ఇది నిజంగా నచ్చుతుంది...నాకయితే పెరుగు అన్నం లో ఈ ఆవకాయ నంజుకోడమంటే చాలా చాలా ఇష్టం.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 10

  1. సీమ చింతకాయల గుళ్ళు రెండు కప్పులు
  2. కారం అర కప్పు
  3. ఆవ పిండి అరకప్పు
  4. ఉప్పు అరకప్పుకి కొంచం తక్కువ గా
  5. మెంతి పొడి అర చెంచా
  6. పసుపు 1/4 చెంచా
  7. దాల్చిని చెక్క పొడి అర చెంచా(రుచి కి)
  8. నూ పొడి 4 చెంచాలు(వేయించి పొడి కొట్టినది)
  9. నిమ్మ ఉప్పు ఒక చెంచా.
  10. నువ్వుల నూనె ఒకటిన్నర కప్పులు

సూచనలు

  1. సీమ చింతకాయలు బాగా లేతవి కాకుండా బాగా ఎర్రగా పండినవి కాకుండా మద్యరకంగా ఉన్నవి తీసుకోవాలి. అంటే గుళ్ళు తెల్లగా ఉండాలి విత్తనం నల్లగా ఉండాలి అన్నమాట ఇవి ఊరగాయకి బావుంటాయి.
  2. ముందుగా కాయలు ఒలిచి ,లోపలి విత్తనాలు తీసేసి 2 కప్పులు ఉండేలా కొలిచి పెట్టుకోవాలి.
  3. పైన చెప్పిన పొడులు అన్ని సిద్ధంగా పెట్టుకోవాలి
  4. ఇప్పుడు ఒక వెడల్పాటి బేసెను తీసుకుని వరుసగా కారం,ఆవపిండి, ఉప్పు, పసుపు,మెంతి పిండి,నూపిండి,దాల్చినచెక్క పొడి,నిమ్మ ఉప్పు అన్ని పొడులు బాగా కలిపి ఉంచాలి.
  5. ఇప్పుడు సీమచింత గుళ్ళని ఒక గిన్నీలోకి తీసుకొని కొద్దిగా నూని పట్టించి పెట్టుకోవాలి.
  6. ఇప్పుడు నూని పట్టించిన వాటిని తీసుకొని, సిద్ధంచేసుకున్న పొడుల మిశ్రమం లో వేసి బాగా కలిపి మిగిలిన నూనె పోసి మళ్ళీ పిండి అంతా కలిసేలా కలుపుకోవాలి.
  7. ఇలా కలిపిన దాన్ని శుభ్రమైన జాడిలోకి తీసుకుని గాలి తగలకుండా మూత పెట్టి 2 రోజులు ఉంచాలి.
  8. 3 వరోజు మళ్ళీ ఒకసారి కలిపుకుంటే ఇక సీమ చింతకాయ ఆవకాయ తినడానికి సిద్ధం అన్నమాట.
  9. వేడి అన్నంలో కలుపుకోవచ్చు. పెరుగు అన్నంలో నంజుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర