గోంగూర రోటి పచ్చడి | GONGURA PICKLE Recipe in Telugu

ద్వారా Sridevi Vedantham  |  9th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • GONGURA PICKLE recipe in Telugu,గోంగూర రోటి పచ్చడి, Sridevi Vedantham
గోంగూర రోటి పచ్చడిby Sridevi Vedantham
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    8

    జనం

1

0

గోంగూర రోటి పచ్చడి వంటకం

గోంగూర రోటి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make GONGURA PICKLE Recipe in Telugu )

  • ఎర్ర గోంగూర - 4 కట్టలు
  • ఎండు మిర్చి - 10 లేదా 12
  • ఆవాలు - 2 టీ స్పూన్లు
  • మెంతులు - 2 టీ స్పూన్లు
  • ఉప్పు - రుచి కి సరిపడా
  • ఇంగువ - 1/2 టీ స్పూను
  • నూనె - 50 మి. లీ
  • పసుపు - 1/2 టీ స్పూను

గోంగూర రోటి పచ్చడి | How to make GONGURA PICKLE Recipe in Telugu

  1. ముందుగా గోంగూర శుభ్ర పరిచి, కడిగి ఆరబెట్టాలి
  2. పాన్లో 2 స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక ఒక్కొక్కటిగా మెంతులు, ఆవాలు, ఎండు మిర్చి వేసి చిటపటలాడాక ఇంగువ వేసి ఎండు మిర్చి , ఇంకా అన్నీ వేగాక(మెంతులు బాగా ఎర్రగా వేగాలి) కమ్మటి వాసన రాగానే స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ లోకి తీసుకొని పసుపు, ఉప్పు కూడా వెయ్యాలి..
  3. పాన్లో కి మిగిలిన నూనె అంతా వేసి వేడి ఐన తర్వాత ఆరబెట్టిన గోంగూర వేసి రంగు మారే వరకు, పిక్ లో ఉన్న విధంగా అయ్యే వరకు వేయించి, ప్లేట్ లో కి తీసుకోవాలి.
  4. పోపు, గోంగూర చల్లారిన తర్వాత ఫస్ట్ పోపు, రోలు ఉంటే రోట్లో లేదా మిక్సీ లో వేసి 3/4th నలిగిన తర్వాత గోంగూర కూడా వేసి 2 సార్లు తిప్పి బౌల్ లోకి తీసుకోవాలి.

నా చిట్కా:

గోంగూర పచ్చడి అన్నంలో సెనగ నూనె తో కలుపుకుంటే చాలా రుచి గా ఉంటుంది. ఇష్టమైన వారు లేత పచ్చి మిర్చి నంచుకుని తిన వచ్చు

Reviews for GONGURA PICKLE Recipe in Telugu (0)