క్యారెట్ పచ్చడి | carrot pachadi Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  10th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • carrot pachadi recipe in Telugu,క్యారెట్ పచ్చడి, Kavitha Perumareddy
క్యారెట్ పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

క్యారెట్ పచ్చడి వంటకం

క్యారెట్ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make carrot pachadi Recipe in Telugu )

  • క్యారెట్ 3
  • ఎండుమిర్చి 6
  • పచ్చిమిర్చి 6
  • జీలకర్ర స్పున్
  • మినప్పప్పు స్పున్
  • శనగపప్పు స్పున్
  • నువ్వులు 3 స్పూన్స్
  • నూనె 2 స్పూన్స్
  • ఉప్పు తగినంత
  • కరివేపాకు కొద్దిగా
  • కొత్తిమీర కొద్దిగా

క్యారెట్ పచ్చడి | How to make carrot pachadi Recipe in Telugu

  1. ముందుగా పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర,మినపప్పు, సేనగపప్పు, ఎండుమిర్చి, వేసి వేపుకోవాలి. తరువాత నువ్వులు కుడి వేసి వేపుకొని ఒక ప్లేట్ లో తీసిపెట్టుకోవాలి.
  2. మళ్ళీ అదే బాండీలో స్పున్ నూనె వేసి క్యారెట్ ముక్కలు,పచ్చిమిర్చి, వేసి 5 నిముషాలు మగ్గించుకోవాలి. తరువాత కొత్తిమీర ,కరివేపాకు వేసి కాసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.
  3. తరువాత రోటిలో ముందుగా ఎండుమిర్చి, నువ్వుల మిశ్రమాన్ని, తగినంత ఉప్పువేసి దంచుకోవాలి.
  4. తరువాత క్యారెట్ మిశ్రమాన్ని వేసి అంతా కలిసేలా దంచుకోవాలి.అంతే ఇంక పచ్చడి రెడీ .పోపు అవసరం లేదు.

Reviews for carrot pachadi Recipe in Telugu (0)