హోమ్ / వంటకాలు / గోంగూర ఉల్లిపాయ పచ్చడి

Photo of Gongura onion pachadi by Sree Sadhu at BetterButter
575
1
0.0(0)
0

గోంగూర ఉల్లిపాయ పచ్చడి

Oct-10-2018
Sree Sadhu
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంగూర ఉల్లిపాయ పచ్చడి రెసిపీ గురించి

గోంగూరలో జీర్ణ శక్తిని పెంచే గుణాలున్నాయి. కాబట్టి జీర్ణక్రియకు బాగా తోడ్పడి ఆకలిని పెంచుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. గోంగూర - 2 కట్టలు
  2. మినపప్పు - 2 చెంచాలు
  3. శనగపప్పు - 2 చెంచాలు
  4. మెంతులు -కొద్దిగా
  5. జిలకర్ర - 1 చెంచా
  6. ఆవాలు - 1/2 చెంచా
  7. ఉప్పు - రుచికి సరిపడా
  8. కారం - 1 చెంచా
  9. నూనె - 50 గ్రాములు
  10. వెల్లుల్లి - 6 రెబ్బలు
  11. ఉల్లిపాయ - 2
  12. ఎండుమిర్చి - 6
  13. కరివేపాకు - 2 రెమ్మలు
  14. ఇంగువ - చిటికెడు

సూచనలు

  1. గోంగూర ఆకులను విడిపించి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 
  2. బానలిలో మినపప్పు, శనగ పప్పు, ఎండు మిరప, మెంతులు, జిలకర్ర, వెల్లుల్లి పాలయలు వేసి సన్నని మంట మీద దోరగా వేపి పక్కన పెట్టుకోవాలి. 
  3. తరువాత అదే బానలిలో కొద్దిగా నూనె వేసి విడిపించి పెట్టుకొన్న గోంగూర ఆకులను వేసి సన్నని మంటమీద వేపాలి. 
  4. ముందుగా వేపుకొన్న పప్పుదినుసులు, తర్వాత వేపిన గోంగూరకు తగినంత ఉప్పును కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. 
  5. ఇలా తయారైన మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని. 
  6. బానలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, వేసి వేగిన తర్వాత గ్రైడ్ చేసి పెట్టుకొన్న పచ్చడిని పోపులో వేసి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత చిటికెడు ఇంగువ కలుపుకొని స్టౌవ్ మీద నుండి దింపుకొని వేడి వేడి రైస్ తో ఆరగించండి. 

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర