వంకాయ దోసకాయ పచ్చడి | Brinjal cucumber chutney Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  10th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Brinjal cucumber chutney recipe in Telugu,వంకాయ దోసకాయ పచ్చడి, Kavitha Perumareddy
వంకాయ దోసకాయ పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

వంకాయ దోసకాయ పచ్చడి వంటకం

వంకాయ దోసకాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Brinjal cucumber chutney Recipe in Telugu )

  • వంకాయలు 3
  • దోసకాయ 1 చిన్నది
  • టమాటాలు 2
  • పచ్చిమిర్చి 8
  • నూనె 3 స్పూన్స్
  • జీలకర్ర స్పున్
  • వెల్లుల్లి 4 రెబ్బలు
  • కరివేపాకు కొద్దిగా
  • ఉప్పు తగినంత

వంకాయ దోసకాయ పచ్చడి | How to make Brinjal cucumber chutney Recipe in Telugu

  1. ముందుగా కూరగాయలు ముక్కలు గా తరిగి పెట్టుకోవాలి
  2. ఇప్పుడు పోయిమీద బాండిపెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లులి, కరివేపాకు వేయించి పక్కకు తీసుకోవాలి.తరువాత కొద్దిగా నూనె వేసి వంకాయలు మగ్గించి పక్కకు తీసి పెట్టుకోవాలి .తరువాత కొంచెం నూనె వేసి దోసకాయ ముక్కలు వేసి మగ్గించి పక్కకు తీసుకోవాలి.తరువాత టమాటాలు వేసి మగ్గించుకోవాలి. అన్నీ విడి విడిగా మగ్గించుకోవాలి.
  3. తరువాత రోటిలో ముందుగా పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసి దంచుకోవాలి .తరువాత వంకాయలు, దోసకాయ,టమాటా ఒక దాని తరువాత ఒకటి వేసి దంచి అంతా కలిపి దంచుకోవాలి.
  4. అంతే ఇంకా పోపు అవసరం లేదు

నా చిట్కా:

ఈ పచ్చడిలో పులుపు కావాలి అంటే కొద్దిగా చింతపండు వేసుకోవచ్చు.

Reviews for Brinjal cucumber chutney Recipe in Telugu (0)