బీరకాయ మెంతికూర పచ్చడి | Ridge gourd Fenugreek chutney Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  10th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ridge gourd Fenugreek chutney  recipe in Telugu,బీరకాయ మెంతికూర పచ్చడి, Kavitha Perumareddy
బీరకాయ మెంతికూర పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

బీరకాయ మెంతికూర పచ్చడి వంటకం

బీరకాయ మెంతికూర పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ridge gourd Fenugreek chutney Recipe in Telugu )

  • బీరకాయ 1 పెద్దది
  • మెంతికూర 2 కట్టలు
  • టమాటాలు 2
  • పచ్చిమిర్చి 5
  • ఎండుమిర్చి 8
  • జీలకర్ర స్పున్
  • మినప్పప్పు స్పున్
  • నూనె 2 స్పున్
  • చింతపండు కొద్దిగా
  • ఉప్పు తగినంత
  • కరివేపాకు కొద్దిగా
  • కొత్తిమీర కొద్దిగా
  • వెల్లులి 4 రెబ్బలు

బీరకాయ మెంతికూర పచ్చడి | How to make Ridge gourd Fenugreek chutney Recipe in Telugu

  1. ముందుగా వస్తువులు అన్నీ రెడీ చేసుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండిపెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేపుకొని పక్కన పెట్టుకోవాలి.
  3. తరువాత బాండీలో స్పున్ నూనె వేసి బీరకాయ ముక్కలు వేసి కొద్దిగా మగ్గిన తరువాత మెంతికూర వేసుకొని మగ్గిన తరువాత టమాటా ,పచ్చిమిర్చి,చింతపండు, వెల్లులి, తగినంత ఉప్పు వేసుకొని 5 నిముషాలు మగ్గించుకోవాలి
  4. ఇప్పుడు రొటిలోముందుగా ఎండుమిర్చి వేసి దంచుకోవాలి. తరువాత బీరకాయ, మెంతికూర మిశ్రమాన్ని వేసి అంతా కలిసేలా దంచుకోవాలి.
  5. మెత్తగా దంచుకున్న తర్వాత గిన్నెలో తీసుకొంటే పచ్చడి రెడీ.పోపు అవసరం ఉండదు.

నా చిట్కా:

బీరకాయ వంటలో వాడే ముందు చేదు ఉందొ లేదో ... తప్పకుండా చూడాలి.లేకపోతే కూర చేదు గా ఐపోయి చెడిపోతుంది.

Reviews for Ridge gourd Fenugreek chutney Recipe in Telugu (0)