మునగాకు పెసరపప్పు కూర | Drumstick Lear’s and moongdal curry Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  11th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Drumstick Lear’s and moongdal curry recipe in Telugu,మునగాకు పెసరపప్పు కూర, Kavitha Perumareddy
మునగాకు పెసరపప్పు కూరby Kavitha Perumareddy
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

1

0

మునగాకు పెసరపప్పు కూర వంటకం

మునగాకు పెసరపప్పు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Drumstick Lear’s and moongdal curry Recipe in Telugu )

 • మునగాకు 2 పెద్ద కప్పులు
 • పెసరపప్పు ఒక కప్
 • పచ్చిమిర్చి 3
 • ఉల్లిపాయలు 2
 • పచ్చి కొబ్బరి తురుము చిన్న కప్
 • కారం సగం స్పున్
 • ఉప్పు తగినంత
 • పసుపు కొద్దిగా
 • నూనె 2 స్పూన్స్
 • పోపుగింజెలు స్పున్
 • ఎండుమిర్చి పోపుకు2
 • వెల్లుల్లి 4 రెబ్బలు
 • కరివేపాకు కొద్దిగా

మునగాకు పెసరపప్పు కూర | How to make Drumstick Lear’s and moongdal curry Recipe in Telugu

 1. ముందుగా మునగాకు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.పెసరపప్పు కడిగి ఒక గంట నానబెట్టుకోవాలి.
 2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి పోపుగింజెలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి పోపు వేగనిచ్చి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ముక్కలు వేసికాసేపు మగ్గించుకోవాలి.తరువాత నానబెట్టి న పెసరపప్పు తగినంత ఉప్పు వేసి కాసేపు మగ్గించుకోవాలి.
 3. తరువాత మునగాకు,పసుపు వేసి కలిపి కొద్దిగా నీళ్లు చిలకరించి కలిపి మూత పెట్టి 5 నిముషాలు మగ్గించుకోవాలి.
 4. ఆకు మగ్గినతరువాత కారం వేసి కలపాలి.తరువాత కొబ్బరి తురుము వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.తరువాత గిన్నెలో తీసుకొని కొబ్బరి తురుము తో అలంకరించుకోవాలి ...

నా చిట్కా:

మునగాకు ఒక పలుచని టవల్ లో చుట్టి పెడితే మరుసటిరోజు కు ఆకులన్నీ విడిగా ఐపోతాయి.అప్పుడు ఈజీ ఒలిచే పని ఉండదు.

Reviews for Drumstick Lear’s and moongdal curry Recipe in Telugu (0)