హోమ్ / వంటకాలు / మునగాకు పెసరపప్పు కూర

Photo of Drumstick Lear’s and moongdal curry by Kavitha Perumareddy at BetterButter
428
2
0.0(0)
0

మునగాకు పెసరపప్పు కూర

Oct-11-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు పెసరపప్పు కూర రెసిపీ గురించి

మునగాకులో క్యాల్షియం ఉంటుంది. ఇంకా ఆడవారికి నెలసరి సమస్యలు దూరం చేస్తుంది.ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. జొన్నరొట్టె మునగాకు కూర చక్కని కాంబినేషన్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మునగాకు 2 పెద్ద కప్పులు
  2. పెసరపప్పు ఒక కప్
  3. పచ్చిమిర్చి 3
  4. ఉల్లిపాయలు 2
  5. పచ్చి కొబ్బరి తురుము చిన్న కప్
  6. కారం సగం స్పున్
  7. ఉప్పు తగినంత
  8. పసుపు కొద్దిగా
  9. నూనె 2 స్పూన్స్
  10. పోపుగింజెలు స్పున్
  11. ఎండుమిర్చి పోపుకు2
  12. వెల్లుల్లి 4 రెబ్బలు
  13. కరివేపాకు కొద్దిగా

సూచనలు

  1. ముందుగా మునగాకు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.పెసరపప్పు కడిగి ఒక గంట నానబెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి పోపుగింజెలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి పోపు వేగనిచ్చి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ముక్కలు వేసికాసేపు మగ్గించుకోవాలి.తరువాత నానబెట్టి న పెసరపప్పు తగినంత ఉప్పు వేసి కాసేపు మగ్గించుకోవాలి.
  3. తరువాత మునగాకు,పసుపు వేసి కలిపి కొద్దిగా నీళ్లు చిలకరించి కలిపి మూత పెట్టి 5 నిముషాలు మగ్గించుకోవాలి.
  4. ఆకు మగ్గినతరువాత కారం వేసి కలపాలి.తరువాత కొబ్బరి తురుము వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.తరువాత గిన్నెలో తీసుకొని కొబ్బరి తురుము తో అలంకరించుకోవాలి ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర