మునగఆకు పచ్చడి | Drumstick leaves chutney Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  12th Oct 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Drumstick leaves chutney by Kavitha Perumareddy at BetterButter
మునగఆకు పచ్చడిby Kavitha Perumareddy
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

47

1

మునగఆకు పచ్చడి వంటకం

మునగఆకు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Drumstick leaves chutney Recipe in Telugu )

 • మునగాకు ఒక పెద్ద కప్
 • పచ్చిమిర్చి 10
 • ఎండుమిర్చి 4
 • జీలకర్ర స్పున్
 • ధనియాలు స్పున్
 • నువ్వులు 2 స్పూన్స్
 • నూనె 3 స్పూన్స్
 • పసుపు కొద్దిగా
 • చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్
 • పోపుగింజెలు స్పున్
 • వెల్లుల్లి 4 రెబ్బలు
 • కరివేపాకు కొద్దిగా
 • ఉప్పు తగినంత

మునగఆకు పచ్చడి | How to make Drumstick leaves chutney Recipe in Telugu

 1. ముందుగా మునగాకు కడిగి పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి.
 2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేగిన తరువాత 2 స్పున్ నువ్వులు కూడా వేపుకొని పక్కకు తీసుకోవాలి.
 3. తరువాత బాండీలో మళ్ళీ ఒక స్పూన్ నూనె వేసి మునగాకు ,కొద్దిగా పసుపు వేసి పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి ....
 4. తరువాత మిక్షిలో ముందుగా పచ్చిమిర్చి, నానబెట్టిన చింతపండు, తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి
 5. తరువాత మునగాకు వేసి రుబ్బుకోవాలి. గట్టిగా ఉంటే చింతపండు నానబెట్టిన నీళ్లు వేసుకొని రుబ్బుకోవాలి.
 6. తరువాత పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి పోపుగింజెలు, వెల్లులి,ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వేగిన తరువాత పచ్చడి వేసి కలుపుకోవాలి. అంతే ఇంక ఎంతో రుచికరమైన, ఆరోగ్య కరమైన మునగాకు పచ్చడి సిద్ధం .వేరే గిన్నెలో తీసిపెట్టుకోవాలి ...3 డేస్ ఉంటుంది

నా చిట్కా:

వంటలలో పసుపు వాడితే ఏమన్నా క్రిములు ఉన్న నశిస్తాయి .

Reviews for Drumstick leaves chutney Recipe in Telugu (1)

laxman oggu5 months ago

జవాబు వ్రాయండి