బచ్చలి ఆకులు పకోడీ | Chinese spinach pakora Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  12th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Chinese spinach pakora recipe in Telugu,బచ్చలి ఆకులు పకోడీ, Gadige Maheswari
బచ్చలి ఆకులు పకోడీby Gadige Maheswari
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    40

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

బచ్చలి ఆకులు పకోడీ వంటకం

బచ్చలి ఆకులు పకోడీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chinese spinach pakora Recipe in Telugu )

  • 1. బచ్చలి ఆకులు - గుప్పెడు
  • 2. శనగపిండి - 1 కప్
  • 3. బియ్యం పిండి - 2 స్పూన్
  • 4. జీలకర్ర - 1/2 స్పూన్
  • 5. వంట సోడా - చిటికెడు
  • 6. ఉప్పు- తగినంత
  • 7. ఉల్లిపాయ - 1
  • 8. పచ్చిమిర్చి - 1
  • 9. నూనె - వేయించడానికి సరిపడానంత
  • 10. కొత్తిమీర , కరివేపాకు - కొంచెం

బచ్చలి ఆకులు పకోడీ | How to make Chinese spinach pakora Recipe in Telugu

  1. ముందుగా బచ్చలి ఆకులను శుభ్రంగా కడిగి చిన్న గా తరిగి పెట్టుకోవాలి.
  2. ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకోవాలి.
  3. ఒక పాత్రలో తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి బచ్చలి ఆకు ముక్కలు తీసుకుని అందులోనే శనగపిండి బియ్యప్పిండి ఉప్పు సోడా జీలకర్ర కరివేపాకు కొత్తిమీర వేసి నీరు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి.
  4. ఒక పాత్రలో నూనె వేసి వేడయ్యాక అందులో బజ్జీ పిండిని కొంచెం కొంచెం గా వేస్తు ఎర్రగా వేయించి తీయాలి. అంతే నండి వేడి వేడి పకోడీలు రెడీ!!!!

నా చిట్కా:

బజ్జీ పిండిలో కొంచెం బియ్యం పిండి కలిపితే బజ్జీ లు చాలా రుచిగా ఉంటాయి.

Reviews for Chinese spinach pakora Recipe in Telugu (0)