గోంగూర రైస్ | Red Sorrel Rice Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  13th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Red Sorrel  Rice by Sudha Badam at BetterButter
గోంగూర రైస్by Sudha Badam
  • తయారీకి సమయం

    40

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

3

0

గోంగూర రైస్ వంటకం

గోంగూర రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Red Sorrel Rice Recipe in Telugu )

  • గోంగూర 1 కట్ట
  • వండిన అన్నం 2 కప్పులు
  • ఉల్లిపాయాలు 2 మీడియం సైజ్ వి
  • పచ్చిమిర్చి 4
  • ఎండుమిర్చి 2
  • పోపు దినుసులు - సెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు
  • పసుపు
  • తగినంత నూనె

గోంగూర రైస్ | How to make Red Sorrel Rice Recipe in Telugu

  1. గోంగూరని శుభ్రం చేసుకుని కడిగి ఆరబెట్టుకోవాలి.
  2. పాన్ లో 1 స్పూను నూనె వేసి 4 పచ్చిమిర్చి, గోంగూర, కొద్దిగా ఉప్పు వేసి మగ్గనిచ్చి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి.
  3. అన్నాన్ని పొడి పొడిగా వండుకుని పక్కన పెట్టుకోవాలి.
  4. బాణలిలో 3 స్పూన్లు నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, సన్నగా పొడుగ్గా తరుగుకున్న ఉల్లిపాయ చీలికలు వేసి బాగా వేగనివ్వాలి.
  5. దానిలో గోంగూర పేస్ట్ వేసి పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి వండిన అన్నాన్ని వేసి మొత్తం కలిసేలా కలుపుకుని స్టవ్ కట్టేయాలి.

నా చిట్కా:

గోంగూర పచ్చడి చేసుకున్నది ఇంట్లో ఉంటే ఈ వంటకం చేయడం చాలా సులువు.

Reviews for Red Sorrel Rice Recipe in Telugu (0)