పాలకూర జంతికలు | Spinach chakli Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  14th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Spinach chakli recipe in Telugu,పాలకూర జంతికలు, Pravallika Srinivas
పాలకూర జంతికలుby Pravallika Srinivas
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

పాలకూర జంతికలు వంటకం

పాలకూర జంతికలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spinach chakli Recipe in Telugu )

 • పాలకూర - 1 కప్పు
 • బియ్యంపిండి - 1 కప్పు
 • పుట్నాల పిండి - 1/4 కప్పు
 • ఉప్పు - తగినంత
 • కారం - తగినంత
 • వాము - 1 spn
 • నువ్వులు - 2 tbsp
 • నీరు - తగినంత
 • నూనె - తగినంత

పాలకూర జంతికలు | How to make Spinach chakli Recipe in Telugu

 1. ముందుగా పాలకూర కడిగి కట్ చేసి ఉడకపెట్టి వడగట్టి చల్లటి నీరు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
 2. ఒక బేసన్ లో బియ్యంపిండి, పుట్నాల పిండి ,ఉప్పు ,కారం, వాము ,నువ్వులు వేసి కలుపుకోవాలి.
 3. ఇప్పుడు ముందుగా చేసిన పాలకూర పేస్ట్ వేసి కలుపుకోవాలి .అవసరం అయితే మరికొన్ని నీరుపోసి జంతికల పిండిలాగా కలుపుకోవాలి.
 4. జంతికల గొట్టం లో స్టార్ బిళ్ళ వేసి లోపల నూనె రాసిపెట్టుకోవాలి. ఇప్పుడు జంతికల పిండి తీస్కొని బాగా మర్దన చేసి జంతికల గొట్టంలో వేసుకోవాలి.
 5. ఒక ప్లాస్టిక్ కవర్ మీద జంతికలు చుట్లులాగా చుట్టుకోవాలి.
 6. కడాయిలో నూనె వేసి కాగాకా సరిపడా జంతికల చుట్లు వేసి కాల్చుకోవాలి.
 7. అంతే రుచికరమైన ఆరోగ్యమైన పాలకూర జంతికల చుట్లు రెడీ ..

నా చిట్కా:

ఎక్కువ పాలకూర వేయకూడదు మదప వాసన వస్తూ సరిగా వేగవు. కొత్తిమీర పుదీనా అయితే అలాగే పేస్ట్ చేసి కలుపుకోవచ్చు.

Reviews for Spinach chakli Recipe in Telugu (0)