హోమ్ / వంటకాలు / పాలకూర జంతికలు

Photo of Spinach chakli  by Pravallika Srinivas at BetterButter
89
4
0.0(0)
0

పాలకూర జంతికలు

Oct-14-2018
Pravallika Srinivas
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర జంతికలు రెసిపీ గురించి

పాలకూర బియ్యం పిండి తో చేసుకొనే ఒక రుచికరమైన చిరుతిండి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. పాలకూర - 1 కప్పు
  2. బియ్యంపిండి - 1 కప్పు
  3. పుట్నాల పిండి - 1/4 కప్పు
  4. ఉప్పు - తగినంత
  5. కారం - తగినంత
  6. వాము - 1 spn
  7. నువ్వులు - 2 tbsp
  8. నీరు - తగినంత
  9. నూనె - తగినంత

సూచనలు

  1. ముందుగా పాలకూర కడిగి కట్ చేసి ఉడకపెట్టి వడగట్టి చల్లటి నీరు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
  2. ఒక బేసన్ లో బియ్యంపిండి, పుట్నాల పిండి ,ఉప్పు ,కారం, వాము ,నువ్వులు వేసి కలుపుకోవాలి.
  3. ఇప్పుడు ముందుగా చేసిన పాలకూర పేస్ట్ వేసి కలుపుకోవాలి .అవసరం అయితే మరికొన్ని నీరుపోసి జంతికల పిండిలాగా కలుపుకోవాలి.
  4. జంతికల గొట్టం లో స్టార్ బిళ్ళ వేసి లోపల నూనె రాసిపెట్టుకోవాలి. ఇప్పుడు జంతికల పిండి తీస్కొని బాగా మర్దన చేసి జంతికల గొట్టంలో వేసుకోవాలి.
  5. ఒక ప్లాస్టిక్ కవర్ మీద జంతికలు చుట్లులాగా చుట్టుకోవాలి.
  6. కడాయిలో నూనె వేసి కాగాకా సరిపడా జంతికల చుట్లు వేసి కాల్చుకోవాలి.
  7. అంతే రుచికరమైన ఆరోగ్యమైన పాలకూర జంతికల చుట్లు రెడీ ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర