బచ్చలి ఆకు మజ్జిగ పులుసు | Malabar spinach buttermilk rasam Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  14th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Malabar spinach buttermilk rasam recipe in Telugu,బచ్చలి ఆకు మజ్జిగ పులుసు, Sree Vaishnavi
బచ్చలి ఆకు మజ్జిగ పులుసుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

బచ్చలి ఆకు మజ్జిగ పులుసు వంటకం

బచ్చలి ఆకు మజ్జిగ పులుసు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Malabar spinach buttermilk rasam Recipe in Telugu )

  • తరిగిన బచ్చలి కూర 1 కప్
  • తరిగిన సొరకాయ ముక్కలు 1 కప్
  • తరిగిన టమాటో 1 కప్
  • తరిగిన పచ్చిమిర్చి 4
  • పుల్లటి మజ్జిగ 1 1/3 కప్
  • సెనగపిండి 2 చెంచాలు
  • ఎండుమిర్చి 2
  • కరివేపాకు 1 రెమ్మ
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • ఇంగువ చిటికెడు
  • పసుపు చిటికెడు
  • నీళ్లు 1 కప్

బచ్చలి ఆకు మజ్జిగ పులుసు | How to make Malabar spinach buttermilk rasam Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి
  2. అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు ,జీలకర్ర ,ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి
  3. అవి చిటపటలాడిన తరువాత అందులో పచ్చిమిర్చి వేసుకొని వేయించాలి
  4. వేయించిన తరువాత అందులో పసుపు ,బచ్చలికూర కూడా వేసి వేయించాలి
  5. అది మగ్గిన తరువాత అందులో సొరకాయ ముక్కలు ,టమాటో ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి
  6. అది ఉడికే లోపు మజ్జిగ లో సెనగపిండి వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా
  7. దానిని ఉడుకుతున్న దాంట్లో వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి

Reviews for Malabar spinach buttermilk rasam Recipe in Telugu (0)