కరివేపాకు పకోడీ | Curry leaves fritters Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  14th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Curry leaves fritters recipe in Telugu,కరివేపాకు పకోడీ, Kavitha Perumareddy
కరివేపాకు పకోడీby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

0

0

కరివేపాకు పకోడీ వంటకం

కరివేపాకు పకోడీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Curry leaves fritters Recipe in Telugu )

  • కరివేపాకు పెద్ద కప్
  • సేనగపిండి చిన్న కప్
  • ఉల్లిపాయలు 2
  • పచ్చిమిర్చి 4
  • ఉప్పు తగినంత
  • కొత్తిమీర గుప్పెడు
  • జీలకర్ర స్పున్
  • నూనె వేయించడానికి సరిపడా

కరివేపాకు పకోడీ | How to make Curry leaves fritters Recipe in Telugu

  1. ముందుగా కరివేపాకు కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి .ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నెలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి చేతితో బాగా కలపాలి .అప్పుడు ఉల్లిపాయలు నీరు బైటకి వస్తుంది. ఉల్లిపాయలు కూడా విడివిడిగా వస్తాయి.
  3. తరువాత కరివేపాకు, కొత్తిమీర వేసి కలపాలి.
  4. తరువాత సేనగపిండి కొద్దికొద్దిగా వేస్తూ కలుపుకోవాలి .
  5. ఉల్లిపాయలు నీరు సరిపోతుంది .ఇంకొంచెం నీళ్లు కావాలి అంటే కొద్దిగా కలుపుకోవాలి. ముద్దగా రాకూడదు పిండి .
  6. ఇలా పైన చూపించిన విధంగా ఉండాలి ...అప్పుడే కరివేపాకు బాగా వేగుతుంది ...
  7. తరువాత పోయిమీద బాండీ పెట్టి నూనె వేసి కాగిందో లేదో ముందు కొద్దిగా పిండి వేసి చూసుకోవాలి.కాగిన తరువాత పిండిని విడివిడిగా చేతితో నలుపుతూ నూనెలో వేసుకోవాలి.అప్పుడు విడివిడిగా ఉండి పకోడీలు బాగా కాలుతాయి. పకోడీలు బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి .తరువాత తీసి పేపర్ న్యాప్కిన్ లో వేసుకోవాలి .అప్పుడు ఎక్కువ ఉన్న నూనె పీల్చుకుంటుంది ...
  8. తరువాత వడ్డించే గిన్నెలో తీసుకోవాలి .అంతే వేడి వేడి కరివేపాకు పకోడీ రెడీ ...

నా చిట్కా:

ఎప్పుడైనా సరే పకోడీ చేసుకోవాలి అంటే ముందుగా ఉల్లిపాయలులో ఉప్పువేసి చేతితో కలిపితే విడివిడిగా అయి పకోడీలు బాగా వస్తాయి .

Reviews for Curry leaves fritters Recipe in Telugu (0)