హోమ్ / వంటకాలు / కరివేపాకు పకోడీ

Photo of Curry leaves fritters by Kavitha Perumareddy at BetterButter
523
4
0.0(0)
0

కరివేపాకు పకోడీ

Oct-14-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కరివేపాకు పకోడీ రెసిపీ గురించి

ఈ పకోడీ కరివేపాకు ఎక్కువ వేసుకొని చేస్తారు . చాలా బాగుంటుంది. ఇలా చేస్తే అందరూ వద్దనకుండా తింటారు .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. కరివేపాకు పెద్ద కప్
  2. సేనగపిండి చిన్న కప్
  3. ఉల్లిపాయలు 2
  4. పచ్చిమిర్చి 4
  5. ఉప్పు తగినంత
  6. కొత్తిమీర గుప్పెడు
  7. జీలకర్ర స్పున్
  8. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా కరివేపాకు కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి .ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నెలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి చేతితో బాగా కలపాలి .అప్పుడు ఉల్లిపాయలు నీరు బైటకి వస్తుంది. ఉల్లిపాయలు కూడా విడివిడిగా వస్తాయి.
  3. తరువాత కరివేపాకు, కొత్తిమీర వేసి కలపాలి.
  4. తరువాత సేనగపిండి కొద్దికొద్దిగా వేస్తూ కలుపుకోవాలి .
  5. ఉల్లిపాయలు నీరు సరిపోతుంది .ఇంకొంచెం నీళ్లు కావాలి అంటే కొద్దిగా కలుపుకోవాలి. ముద్దగా రాకూడదు పిండి .
  6. ఇలా పైన చూపించిన విధంగా ఉండాలి ...అప్పుడే కరివేపాకు బాగా వేగుతుంది ...
  7. తరువాత పోయిమీద బాండీ పెట్టి నూనె వేసి కాగిందో లేదో ముందు కొద్దిగా పిండి వేసి చూసుకోవాలి.కాగిన తరువాత పిండిని విడివిడిగా చేతితో నలుపుతూ నూనెలో వేసుకోవాలి.అప్పుడు విడివిడిగా ఉండి పకోడీలు బాగా కాలుతాయి. పకోడీలు బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి .తరువాత తీసి పేపర్ న్యాప్కిన్ లో వేసుకోవాలి .అప్పుడు ఎక్కువ ఉన్న నూనె పీల్చుకుంటుంది ...
  8. తరువాత వడ్డించే గిన్నెలో తీసుకోవాలి .అంతే వేడి వేడి కరివేపాకు పకోడీ రెడీ ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర