పాలక్ రవ్వ ఇడ్లీ | Spinach sooji idli Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  15th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Spinach sooji idli recipe in Telugu,పాలక్ రవ్వ ఇడ్లీ, రమ్య వూటుకూరి
పాలక్ రవ్వ ఇడ్లీby రమ్య వూటుకూరి
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

పాలక్ రవ్వ ఇడ్లీ వంటకం

పాలక్ రవ్వ ఇడ్లీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spinach sooji idli Recipe in Telugu )

  • పాలకూర 2 కట్టలు
  • పచ్చిమిర్చి 2
  • జీలకర్ర 1 స్పూన్
  • అల్లం అంగుళం ముక్క
  • నెయ్యి 2 స్పూన్స్
  • పోపుగింజలు 2 స్పూన్
  • జీడిపప్పు 2 స్పూన్స్
  • కొత్తిమీర కొంచం
  • పెరుగు 1 కప్
  • ఉప్మా రవ్వ 2 కప్స్
  • ఉప్పు తగినంత
  • వంట సోడా కొంచం

పాలక్ రవ్వ ఇడ్లీ | How to make Spinach sooji idli Recipe in Telugu

  1. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి
  2. బాండీ వేడెక్కాక నెయ్యి వేసుకొని పోపుగింజలు జీడిపప్పు వేసి వేయించాలి
  3. పోపు వేగాక రవ్వ వేసుకొని వేయించాలి
  4. ఒక గిన్నెలో కొంచం వాటర్ పోసి పాలకూర జీలకర్ర అల్లం పచ్చిమిర్చి 2 నిముషాలు ఉడికించాలి
  5. పాలకూర చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
  6. రవ్వ మిశ్రమ0 చల్లారాక పాలకూర పేస్ట్ ఉప్పు పెరుగు వంటసోడా వేసి కలిపి 10 మినిట్స్ నాననివ్వాలి
  7. తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి అవసరం ఐతే వాటర్ పోసుకొని ఇడ్లీ పిండిలా తయారు చేసుకోవాలి
  8. ఈ పిండిని ఇడ్లీ లా వేసోవాలి
  9. అంతే పాలక్ రవ్వ ఇడ్లీ రెడి ఏదైనా చట్నీ తో బాగుంటుంది

నా చిట్కా:

పాలకూర ఉడికించేప్పుడు మూత పెట్టినా ఉప్పువేసినా కలర్ మారిపోతుంది

Reviews for Spinach sooji idli Recipe in Telugu (0)