హోమ్ / వంటకాలు / ఆకుల చిట్లుపొడి

Photo of Mixed leafy mixed dal gun powder by Pravallika Srinivas at BetterButter
168
1
0(0)
0

ఆకుల చిట్లుపొడి

Oct-15-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆకుల చిట్లుపొడి రెసిపీ గురించి

ఆకుకూరల చిట్లుపొడి అన్ని పప్పులు వేయించి ఆకులు అన్ని నీడకు యండినవి కలిపి తయారు చేసే ఒక రుచికరమైన పొడి. ఇది వేడి అన్నం నెయ్యి లో తినచ్చు. అన్నిరకాల నిలవపచ్చడితో కలిపి తినవచ్చు. వేడి అన్నం ఆవకాయ ముద్దపప్పు అందరికి తెలుసు కానీ ఈ కాంబినేషన్ చిట్లుమ్ పొడి నెయ్యి ఆవకాయ వెస్కొని తింటే చాలా బాగుంటుంది.పెరుగు అన్నం లోకి నంచుకోవడానికి కూడా బాగుంటుంది .అలాగే ఇడ్లీ దోసలో తినడానికి మీగడ నెయ్యి నూనె దేంట్లో అయినా కలిపి తినేయవచు. మిగిలిన ఇడ్లీ లో కూడా ముక్కలు చేసి పెట్టి పోపు పెట్టి ఈ పొడి కలిపి రెండు నిమిషాలు మగ్గనిస్తే చిట్లుమ్ పొడి తవ ఇడ్లీ రెడీ. ఇంకా అందుకు ఆలస్యం తయారు చేసే విధానం చూసేదం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • దోరగా వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 10

  1. పుదీనా - 3 tbsp
  2. మెంతికూర - 3 tbsp
  3. మునగాకు - 3 tbsp
  4. చింతాకు - 3 tbsp
  5. కర్వేపాకు - 3 tbsp
  6. మినపప్పు - చిన్న కప్పు
  7. పచ్చిపప్పు - చిన్న కప్పు
  8. ఉలవలు - చిన్న కప్పు
  9. పెసలు - చిన్న కప్పు
  10. ఉప్పు - చిన్న కప్పు
  11. కారం - చిన్న కప్పు
  12. వెల్లులిరెబ్బలు -20
  13. జీలకర్ర - 4 tbsp
  14. ఇంగువ - 1/2 spn

సూచనలు

  1. ముందుగా పుదీనా మెంతికూర మునగాకు చింతాకు కర్వేపాకు అన్నింటిని శుభ్రం చేసి నీడలో యండపెట్టాలి. ఆకులు అన్ని యండపెట్టడం వలన రంగు మారిపోతాయి కానీ సువాసన ఉంటుంది.
  2. ఇప్పుడు కడాయి లో నూనె లేకుండా మినపప్పు ,పచ్చిపప్పు ,పెసలు ,ఉలవలు అన్నింటిని విడివిడిగా వేయించుకోవాలి.
  3. వేయించిన పప్పులు చల్లారేలోగా వెల్లులికారం తయారీకి ఒక మిక్సర్ జార్ లో ఉప్పు ,కారం ,వెల్లులిరెబ్బలు ,జీలకర్ర, ఇంగువ వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు అదే మిక్సర్ జార్లో చల్లారిన పప్పులు వేసి మీడియం కోర్స్ గా పొడి చేసుకోవాలి.
  5. అందులో తయారైన ఆకులు వేసి మరొక సారి కలిసేలాగా గ్రైండ్ చేసుకోవాలి.
  6. చివరిగా వెల్లులి కారం కూడా వేసి మరొకసారి పల్స్ తిప్పుకోవాలి.
  7. తయారైన పొడి ని గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.ఎక్కువ సమయం ఓపెన్ గా ఉంటే వాసన పోతుంది కాబట్టి వెంటనే మూత పెట్టుకోవాలి.
  8. అంతే రుచికరమైన ఆకుల చిట్లుమ్ పొడుం సిద్ధం... -

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర