హర బర కబాబ్ | Green Cutlet Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  15th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Green Cutlet recipe in Telugu,హర బర కబాబ్, Pravallika Srinivas
హర బర కబాబ్by Pravallika Srinivas
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

3

0

హర బర కబాబ్ వంటకం

హర బర కబాబ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Green Cutlet Recipe in Telugu )

  • పాలకూర - చిన్న కట్ట
  • బంగాళాదుంపలు - 4
  • పచ్చి బఠాణీలు - 1 కప్పు
  • ఉప్పు - తగినంత
  • నీరు - తగినంత
  • అల్లం - 1 అంగుళం
  • వెల్లులిరెబ్బలు - 4
  • పచ్చిమిర్చి - 4
  • కొత్తిమీర - 4 రెమ్మలు
  • కార్న్ఫ్లోర్ - 2 tbsp
  • శనగపిండి - 1 tbsp
  • బ్రెడ్ క్రమ్స్ - 5 tbsp
  • చాట్ మసాలా - 1/2 tbsp
  • గరం మసాలా - 1/2 tbsp
  • కారం - 1/4 tbsp
  • పసుపు - 1/4 tbsp
  • జీడిపప్పు - తగినంత
  • నూనె - తగినంత

హర బర కబాబ్ | How to make Green Cutlet Recipe in Telugu

  1. ముందుగా పాలకూరను కడిగి ఉడికించుకొని స్ట్రైన్ చేసి చల్లనీరు పైనుండి పోయాలి.
  2. కుక్కర్ లో బంగాళాదుంపలు నానపెట్టిన బఠాణి లేదా పచ్చిబఠాణీలు ,ఉప్పు ,నీరు వేసి ఉడికించుకోవాలి.
  3. నీటిని వడగట్టి బఠాణీలు చల్లారిన తర్వాత మిక్సర్ జార్ లో వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టాలి.
  4. ఇప్పుడు ఉడికించినపాలకూర ,కొత్తిమీర, అల్లం ,వెల్లులిరెబ్బలు ,పచ్చిమిర్చి వేసి పేస్ట్ లాగ గ్రైండ్ చేస్కుని తయారైన బఠాణి మిశ్రమంలో వేస్కోవాలి.
  5. బంగాళాదుంపలు పొట్టు వలిచి మెదుపుకుని బఠాణి మిశ్రమంలో వేసి కలుపుకోవాలి.
  6. ఇప్పుడు రెడీ అయిన మిశ్రమంలో కార్న్ఫ్లోర్ ,శనగపిండి, బ్రెడ్ క్రమ్స్ ,చాట్ మసాలా ,గరం మసాలా ,కారం ,ఉప్పు, పసుపు ,ఇంగువ అన్ని వేసి బాగా కలిపి ముద్ద చేసుకోవాలి.
  7. ఇప్పుడు తయారైన ముద్దను ఉండలు చేసుకోవాలి.
  8. తర్వాత ప్రెస్ చేసి మనకునచ్చిన షేప్ లో చేసుకొని పైన జీడిపప్పును ప్రెస్ చేయాలి.
  9. తయారైన కట్లెట్స్ ని బ్రెడ్ క్రమ్స్ లో ముంచి అన్నివైపులా అద్దుకోవాలి.
  10. స్టవ్ మీద అడుగు వెడల్పుగా ఉన్న కడై లో నూనె వేసి కాగాక కట్లెట్స్ వేసి షాలో ఫ్రై చేసుకోవాలి.
  11. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పేపర్ నాప్కిన్ లో వేస్కోవడం వలన ఎక్సెస్ ఆయిల్ పీల్చుకుంటుంది .
  12. సెర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే రుచికరమైన హర బర కబాబ్ రెడీ ..

నా చిట్కా:

పదార్థాలు అన్ని ఉడికించినవి కాబట్టి ఎక్కువ వేగానవసరం లేదు. ఇష్టం ఉంటే కాప్సికం బీన్స్ కూడా వేస్కొవచ్చు.

Reviews for Green Cutlet Recipe in Telugu (0)