తమలపాకుల పచ్చడి | Betel Leaves Chutney Recipe in Telugu

ద్వారా Shailaja R  |  16th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Betel Leaves Chutney recipe in Telugu,తమలపాకుల పచ్చడి, Shailaja R
తమలపాకుల పచ్చడిby Shailaja R
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

తమలపాకుల పచ్చడి వంటకం

తమలపాకుల పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Betel Leaves Chutney Recipe in Telugu )

  • తమలపాకులు - 10
  • చింతపండు గుజ్జు - 1 టేబుల్ స్పూన్
  • బెల్లం - 2 టీస్పూన్
  • పచ్చిమిర్చి - 6
  • నువ్వులు - 2 టేబుల్ స్పూన్
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • మినప్పప్పు - 2 టీస్పూన్
  • శనగపప్పు - 3 టీస్పూన్
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • కొత్తిమీర - 1/4 కప్పు
  • వెల్లుల్లి - 4 పాయలు
  • ఉప్పు తగినంత
  • నూనె - 1 టేబుల్ స్పూన్
  • తాలింపుకి :
  • ఆవాలు - 1 టీస్పూన్
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • మినప్పప్పు - 1 టీస్పూన్
  • కరివేపాకు - 1 రెమ్మలు
  • ఎండుమిర్చి - 3
  • నూనె - 1 టీస్పూన్

తమలపాకుల పచ్చడి | How to make Betel Leaves Chutney Recipe in Telugu

  1. బాండిలో నూనె కాగాక జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి వేగనివ్వాలి.
  2. వీటితో పాటు పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి.
  3. మిక్సీజార్ లో వేయించిన నువ్వుల్ని పొడి చేయాలి. దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలి.
  4. పైన వేయించిన మిశ్రమాన్ని మిక్సీజార్లోకి తీసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి.
  5. దీనికి చింతపండు గుజ్జు, బెల్లం, ఉప్పు వేసి మెత్తగా చేయాలి.
  6. దీనిని ఒక బౌల్లోకి తీయాలి.
  7. బాండిలో నూనె కాగాక తాలింపు దినుసులు వేసి వేగనివ్వాలి.
  8. ఈ తాలింపుని పచ్చడికి కలపాలి.
  9. వేడి అన్నంలో ఈ పచ్చడి, నెయ్యి వేసి కలిపి తినాలి.

నా చిట్కా:

తమలపాకు వగరుగా ఉంటుంది కాబట్టి చింత పండు, బెల్లం తప్పనిసరిగా వాడాలి.

Reviews for Betel Leaves Chutney Recipe in Telugu (0)