పాలక్ కార్న్ మాగీ టార్ట్స్ | Spinach corn maggie tarts Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  16th Oct 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Spinach corn maggie tarts recipe in Telugu,పాలక్ కార్న్ మాగీ టార్ట్స్, Sudha Badam
పాలక్ కార్న్ మాగీ టార్ట్స్by Sudha Badam
 • తయారీకి సమయం

  40

  నిమిషాలు
 • వండటానికి సమయం

  40

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

7

1

పాలక్ కార్న్ మాగీ టార్ట్స్ వంటకం

పాలక్ కార్న్ మాగీ టార్ట్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spinach corn maggie tarts Recipe in Telugu )

 • మైదా 2 కప్పులు
 • పాలకూర 2 కట్టలు
 • పచ్చిమిర్చి 3
 • మాగీ నూడుల్స్ 2 పాకెట్స్
 • స్వీట్ కార్న్ 100 గ్రాములు
 • టమాటా సాస్
 • డీప్ ఫ్రై కి సరిపడా నూనె

పాలక్ కార్న్ మాగీ టార్ట్స్ | How to make Spinach corn maggie tarts Recipe in Telugu

 1. పాలకూరని వేడి నీళ్లల్లో వేసి ఒక పొంగు రానిచ్చి తీసి చల్లటి నీళ్లల్లో వేసి వడగట్టి ఆ పాలకూర పచ్చిమిర్చి మిక్సీ లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.
 2. ఒక బౌల్ లో మైదా తీసుకుని కాచిన నూనె రెండు స్పూన్లు వేసి ఈ పాలకూర పేస్ట్ వేసుకుంటూ పూరి పిండిలా కలుపుకోవాలి. ఈ ముద్దని గంట సేపు ఫ్రిడ్జ్ లో ఉంచాలి.
 3. చిన్న చిన్న ఉండలు తీసుకుని పూరిలా వత్తుకోవాలి.
 4. ఇంట్లో టార్ట్ మోల్డ్ ఉంటే సరే లేదంటే చిన్న స్టీల్ గిన్నెలు తీసుకుని వాటికి వెనక వైపు నూనె రాసి పూరీని వెనక నుండి గిన్నెకి అంటించాలి. అంచులు లోపలికి ముడవకూడదు.
 5. కదాయి లో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పెట్టి బాగా మరిగాక పూరీలు అతికిచ్చుకున్న గిన్నెలని నెమ్మదిగా నూనెలోకి వదలాలి.
 6. పూరీ బాగా వేగితే గిన్నె దానంతట అదే ఊడి వచ్చేస్తుంది.
 7. బాగా వేగిన పూరీలని ప్లేట్ లోకి తీసుకోవాలి.
 8. ఫిల్లింగ్ కోసం స్టవ్ మీద గిన్నెలో సరిపడా నీళ్లు పోసుకుని మరిగాక మాగీ మసాలా, నూడుల్స్, కార్న్ గింజలు,తరిగిన పాలకూర ఆకులు వేసి ఉడికాక దింపుకోవాలి.
 9. ఈ మిశ్రమాన్ని ని టార్ట్ల లో నింపుకొని టమాటా సాస్ తో సర్వ్ చేసుకోవాలి.

నా చిట్కా:

Filling మన టేస్ట్ కి తగినట్టు భేల్పూరిలా చేసుకోవచ్చు.

Reviews for Spinach corn maggie tarts Recipe in Telugu (1)

Sravanti 9 months ago

జవాబు వ్రాయండి

Cooked it ? Share your Photo