BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఖాండ్వీ(గుజరాతీ వంటకం)(కుక్కర్ లో)

Photo of Khandhvi(In Pressure Cooker) by Tejaswi Yalamanchi at BetterButter
0
0
0(0)
0

ఖాండ్వీ(గుజరాతీ వంటకం)(కుక్కర్ లో)

Oct-16-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఖాండ్వీ(గుజరాతీ వంటకం)(కుక్కర్ లో) రెసిపీ గురించి

గుజరాతీ ఖాండ్వీగా పిలవబడే సెనగపిండి ఖాండ్వీ గుజరాతీయుల ఆహారంలో ఎంతో ప్రసిద్ధిచెందిన చిరుతిండి. సెనగపిండి, పెరుగుతో తయారయ్యే ఈ చిన్న చిన్న మెత్తని కట్ చేసిన స్నాక్ , సులభంగా ఇంట్లోనే తక్కువ సమయంలో చేసేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఇబ్బందిపెట్టే విషయం సెనగపిండి బాగా కలవడం. గుజరాతి ఖాండ్వీలో ఉండే తగినంత పుల్లదనం, ఉప్పదనం కలిసి ఈ వంటకం చాలా రుచికరంగా, సంతృప్తికరంగా మారుతుంది. దీన్ని కొత్తిమీర పచ్చడి లేదా కెచప్ తో కలిపి తింటారు. మీ సాయంకాలపు టీకి ఇది చక్కని మిత్రుడు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • గుజరాత్
  • ఆవిరికి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. సెనగపిండి -1 కప్పు
  2. పాలకూర జ్యూస్ - 1/2 కప్
  3. పెరుగు - 1/2 కప్
  4. నీరు - 1 కప్
  5. ఉప్పు రుచికి కావాల్సినంత
  6. పసుపు - అరచెంచా
  7. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ - 1 చెంచా
  8. నూనె - 3 చెంచాలు
  9. ఆవాలు - 1 చెంచా
  10. జీలకర్ర - 1 చెంచా
  11. కరివేపాకు - 2 రెమ్మలు
  12. కొత్తిమీర (బాగా తరిగినవి ) - 4 చెంచాలు

సూచనలు

  1. ముందుగా అన్ని పదార్థాలు సిద్దం చేసుకోండి.
  2. ఒక గిన్నె లో సెనగపిండి,పెరుగు,నీరు,ఉప్పు,పసుపు,అల్లం పచ్చిమిర్చి పేస్ట్,పాలకూర జ్యూస్ వేసి బాగా ఉండలు లేకుండా కలపండి.
  3. కుక్కర్ లో కింద నీరు పోసి పైన గిన్నె పెట్టి అయిదు కుతాల వరకు ఉడికించండి.
  4. అదే సమయంలో, ఒకటి లేదా రెండు పళ్ళేలపై నూనె రాసి పెట్టుకోండి.
  5. ఆవిరి అంత పోయాక గిన్నె బయటకి తీసి వెంటనే బాగా కలపండి గరిటె వాడి ఆ పేస్ట్ ను పళ్ళాలకు సమంగా వేసి రాయండి.
  6. 5 నిమిషాల పాటు చల్లబడనివ్వండి.
  7. 2 అంగుళాల మేరకు పొడవుగా కట్ చేయండి.
  8. కొత్తిమీర మిశ్రమాన్ని పైన చల్లండి.
  9. ఈ కట్ చేసినవాటిని గుండ్రంగా ఏది విచ్చుకోకుండా కట్టండి.
  10. ఒక గిన్నె పెట్టీ నూనెను వేసి వేడిచేయండి. ఆవాలను , జీలకర్ర వేసి వేయించండి. కరివేపాకును కూడా వేసి బాగా కలిపి స్టవ్ కట్టేయండి.దీన్ని ఖాండ్వీపై పోయండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర