హోమ్ / వంటకాలు / తులసి ఆకుల అన్నం

Photo of Basil leaves Rice by Pravallika Srinivas at BetterButter
585
0
0.0(0)
0

తులసి ఆకుల అన్నం

Oct-17-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తులసి ఆకుల అన్నం రెసిపీ గురించి

భారతదేశం లో ప్రతి ఇంట తులసి చెట్టు ఉంటుంది. ఈ చెట్టుని దేవతగా పూజిస్తారు. తుల‌సి ఆకును ప్ర‌కృతి ప్ర‌సాదించిన‌ త‌ల్లి.అయితే తుల‌సి ఆకుకు ఎన్నో ర‌కాల వ్యాధులతో పోరాడే అద్భుత‌మైన‌ శ‌క్తి ఉంది. తులసి ఆకు ఆరోగ్యంతోపాటు.. చర్మ సంరక్షణకి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా దివ్య ఔషధంలా పనిచేస్తుంది కాబట్టే పెద్దలు తులసిని సర్వరోగ నివారిణిగా పిలిచారు. తులసి ఆకులను పేస్ట్ చేసి ఉడికించిన అన్నం తో చేసుకునే ఒక రుచికరమైన రైస్ తులసిరైస్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • వేగన్

కావలసినవి సర్వింగ: 3

  1. తులసి ఆకులు - 1 cup
  2. బియ్యం - 2 cups
  3. కొత్తిమీర - 1/2 cup
  4. పచ్చిమిర్చి - 4
  5. ధనియాలు - 1 spn
  6. జీలకర్ర - 1/2 spn
  7. మిరియాలు - 6
  8. వేయించిన పల్లీలు - 1 tbsp
  9. బంగాళదుంప ముక్కలు - 1
  10. నూనె - తగినంత
  11. ఉప్పు - 1 spn

సూచనలు

  1. ముందుగా తులసి ఆకులు కడిగి పెట్టుకోవాలి.
  2. బియ్యం కడిగి అన్నాన్ని పొడి పొడి గా వండుకోవాలి.
  3. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లో తులసి ఆకులు, పచ్చిమిర్చి ,కొత్తిమీర , వేయించిన పల్లీలు ,మిరియాలు ,జీలకర్ర, ధనియాలు వేసి పేస్ట్ లాగ గ్రైండ్ చేసుకోవాలి.
  4. ఇప్పుడు కడాయి పెట్టి నూనె వేసి కాగాక బంగాళదుంప ముక్కలు వేసి వేగాకా తయారైన పేస్ట్ వేసి పచ్చివాసన పోయాకా ఉప్పు వేసి కలిపి ముందుగా వండిన అన్నని వేసి కలిసేలాగా కలుపుకోవాలి.
  5. అంతే ఆరోగ్యభరితమైన తులసి ఆకుల అన్నం సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర