హోమ్ / వంటకాలు / తమలపాకుల స్వీట్ పాన్ / డ్రై పాన్ చాక్లెట్

Photo of Betal leaf paan /Dry paan Chocolate by Pravallika Srinivas at BetterButter
569
1
0.0(0)
0

తమలపాకుల స్వీట్ పాన్ / డ్రై పాన్ చాక్లెట్

Oct-20-2018
Pravallika Srinivas
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తమలపాకుల స్వీట్ పాన్ / డ్రై పాన్ చాక్లెట్ రెసిపీ గురించి

వివిధ నోములు, వ్రతాలు, శుభ కార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు. వస్త్రంతో పాటు రెండు తమలపాకులు కూడా ఇస్తారు.ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను పక్కన పెడితే, శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ - అంటే పీచు పదార్ధం తమలపాకులో చాలా ఎక్కువగా వుంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అంతే .పండగలకు పూజలకు తమలపాకులు మిగులుతూ ఉంటాయి కదా వాటిని పడేయ కుండా ఈ స్వీట్ పాన్ చేసుకుంటే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు వేస్కొవచ్చు. తమలపాకుల డ్రై పాన్ తయారీ విధానం చూసేద్దామా..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. తమలపాకులు - 10
  2. పంచదార - 1 కప్పు
  3. నీరు - 1 కప్పు
  4. బిర్యానీ ఆకు - 1
  5. స్టార్ - 1
  6. పట్టా - 1 ముక్క
  7. అనాస పువ్వు - 2
  8. యాలకలు -4
  9. నిమ్మరసం - 1/4 స్పూన్
  10. సున్నం - చిటికెడు
  11. కజ్జురం ముక్కలు - 3
  12. సోంపు - 1 టేబుల్ స్పూన్
  13. స్వీట్ సోంపు - 1 టేబుల్ స్పూన్
  14. పుచ్చ గింజలు - 2 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా తమలపాకులను కడిగిపెట్టుకోవాలి.
  2. తొడిమలు కట్ చేసి సన్నగా కట్ చేస్కుని .
  3. ఒక బాండి పెట్టి పంచదార నీరు బిర్యానీ ఆకు స్టార్ పట్టా అనాస పువ్వు యాలకలు వేసి కరగనివాళ్ళు.
  4. ఇప్పుడు ముందుగా కట్ చేసిన తమలపాకులను వేసి బాగా కలుపుకోవాలి.కొంచం నిమ్మరసం, చిటికెడు సున్నం వేసి కలుపుకుని దగ్గరకు పడనివ్వాలి.
  5. ముందుగా వేసిన బిర్యానీ ఆకు, స్టార్, అనాస పువ్వు ,పట్టా పక్కన పెట్టుకోవాలి.
  6. తయారైన పాన్ మిశ్రమాన్ని ఒక గిన్ని లో తీస్కుని కజ్జురం ముక్కలు సోంపు స్వీట్ సోంపు పుచ్చ గింజలు వేసి కలుపుకోవాలి.
  7. అంతే రుచికరమైన హోమ్ మేడ్ స్వీట్ డ్రై పాన్ రెడీ .
  8. దీనిని అలాగే ఉండలు చేసి వ్రాప్ చేసి పాన్ చాక్లెట్లాగ ఉపయోగించుకోవటానికి భద్రపరుచుకోవచ్చు.
  9. లేదంటే ఆకుల్లో వేస్కుని కిల్లిలాగా చుట్టుకుని వేస్కొవచ్చు. అంతే తమలపాకుల స్వీట్ పాన్ రెడీ.....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర