హోమ్ / వంటకాలు / మేతి నమక్ పారా

Photo of Dried fenugreek leaves savoury by Pravallika Srinivas at BetterButter
608
1
0.0(0)
0

మేతి నమక్ పారా

Oct-20-2018
Pravallika Srinivas
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మేతి నమక్ పారా రెసిపీ గురించి

బాలింతలకు మెంతుల కషాయం, మెంతి కూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాలు ఉత్పత్తి పెరుగుతుంది. తల్లిపాలు తాగే ఎవరైనా సరే ఆరోగ్యంగా పెరుగుతారు. బాలింతలకు మెంతులతో తయారు చేసిన పదార్థాలను తినిపించడం దేశ వ్యాప్తంగా ఉంది. ఉత్తర భారతదేశంలో బాలింతలకు మెంతి హల్వా పెడతారు. మెంతులను నేతిలో వేయించి, మెత్తగా చూర్ణంచేసి, దానికి సమానంగా గోధుమ పిండిని కలిపి,తగినంత పంచదార వేసి హల్వా తయారు చేస్తారు.అంతే కాదు మధుమేహం ని కూడా నియంత్రిస్తుంది. మేతి ఆకులను నీడలో యండబెట్టిన తర్వాత తయారు చేసే ఆకును కసూరి మేతి అంటారు. గోధుమ పిండిలో ఈ కసూరి మేతి వేసి కలిపి చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తినే స్నాక్ .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 10

  1. గోధుమ పిండి - 250 గ్రా
  2. ఉప్పు - 1 స్పూన్
  3. కసూరి మేథీ - 4 టేబుల్ స్పూన్
  4. వెన్న -2 టేబుల్ స్పూన్
  5. వాము - 1 టేబుల్ స్పూన్
  6. నీరు - తగినంత
  7. నూనె - తగినంత

సూచనలు

  1. ముందుగా తాలింపు కడాయి లో వెన్న వేసి కరగనివ్వాలి.
  2. ఒక బేసన్ తీస్కుని గోధుమ పిండి , ఉప్పు, వాము ,కసూరి మేథీ ,కాగిన వెన్న వేసి కలిపి తగినన్ని నీరు వేసి గట్టిగా కలిపి ముద్ద చేసుకోవాలి.
  3. ఇప్పుడు తయారైన ముద్దని చపాతీ ఉండలుగా చేసుకోవాలి. ఒక్క ఉండని తీస్కుని వీలైనంత పల్చగా వత్తుకోవాలి.
  4. తయారైన చపాతీ చాకుతో డైమండ్స్ లాగ కట్ చేసుకోవాలి.
  5. కడాయి పెట్టి నూనె వేసి కాగాకా తయారైన డైమండ్స్ ని డీప్-ఫ్రై చేసుకోవాలి.
  6. అంతే వేడి వేడి మేథీ నమక్ పారా రెడీ.....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర