హోమ్ / వంటకాలు / కొత్తిమీర పచ్చడి

Photo of coriander  chutney  by Anitha Rani at BetterButter
473
1
0.0(0)
0

కొత్తిమీర పచ్చడి

Oct-21-2018
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర పచ్చడి రెసిపీ గురించి

కొత్తిమీర ను కూరలలో వేస్తే కొద్దిగా తింటాము.పచ్చడి లో అయితే ఎక్కువ గా పోషకాలు లభిస్తాయి.ఎక్కువగా తినగలుగుతాము.,అన్నము లోకి,బ్రెడ్ లోకి తినొచ్చు.చాలా సులభముగా,త్వరగా చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. కొత్తిమీర 1కట్ట
  2. పచ్చిమిర్చి 6
  3. దోర టమోటా 1 పెద్దది
  4. వెల్లుల్లిరెబ్బలు 6
  5. ఉప్పు తగినంత
  6. చింతపండు కొద్దిగా
  7. నూనె 2 టేబుల్ స్పూన్లు
  8. పోపు గింజలు 1 స్పూన్
  9. కరివేపాకు 2 రెమ్మలు
  10. జీలకర్ర 1/2 స్పూన్
  11. పసుపు కొద్దిగా

సూచనలు

  1. స్టవ్ పైన పాన్ వేడి అయ్యాక జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు,పచ్చిమిర్చి,టమాటా ముక్కలు,కొత్తిమీర చిన్న మంట పైన ఒకదాని తరువాత ఒకటి వేగనివ్వాలి.
  2. అన్ని చల్లారిన తరువాత మిక్సీ కి వేసుకోవాలి......దానిలో చింతపండు,ఉప్పు కలిపి రుబ్బుకోవాలి.
  3. మెత్తగా అయిన తరువాత గిన్నె లోకి తీసుకోవాలి.
  4. పాన్ లో ఆయిల్ వేడి అయ్యాక పోపు గింజలు,ఎందుమిరపకాయ,కరివేపాకును వేసి వేగాక రుబ్బుకున్న పచ్చడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
  5. రుచికరమైన కొత్తిమీర పచ్చడి తయారు. వేడి అన్నము లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.
  6. పసుపు వేయడం వలన పసుపు రంగులో ఉంది,వేయక పోతే ఆకుపచ్చ గా ఉంటుంది.అది మన ఇష్టము.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర