హోమ్ / వంటకాలు / మునగాకు సొరకాయ మల్టీగ్రైన్ ముథియా

Photo of Moringa Bottleguard Multigrain Muthia by Pravallika Srinivas at BetterButter
317
1
0.0(0)
0

మునగాకు సొరకాయ మల్టీగ్రైన్ ముథియా

Oct-21-2018
Pravallika Srinivas
20 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు సొరకాయ మల్టీగ్రైన్ ముథియా రెసిపీ గురించి

ముథియా గుజరాతీ లో ప్రత్యేకంగా సెంట్రల్ గుజరాతి వంటకం. ఇది ఒక స్నాక్ ఐటెం. దీనిని సాధారణంగా శనగపిండి మెంతికూర పసుపు ఉప్పు కారం నూనె వేసి తయారు చేస్తారు . కొన్ని ప్రాంతాల గుజరాతి వాళ్ళు గోధుమ మరియు ఇతర పిండ్లతో సొరకాయతురుము కాకరకాయ పొట్టు మరియు వివిధ రకాల ఆకుకూరలతో చేసుకుంటారు. ఈ ముథియా ని ఉడికించి ముక్కలుగా కట్ చేసి ఆవాలు నువ్వులు తాలింపు పోపు పెట్టి కొంచం వేపుకుంటారు.అలాగే ఉడికించినవి కూడా సనగనూనె వేస్కుని వేడి వేడి గా తినేయచ్చు. మరి నేను చేసే ముథియా పేరు 'మునగాకు సొరకాయ ముల్తిగ్రైన్ ముథియా '.మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా?

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • గుజరాత్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. మునగాకులు - 1 కప్పు
  2. మెంతిఆకులు - 1/2 కప్పు
  3. కొత్తిమీర తరుగు - 1/2 కప్పు
  4. సొరకాయ తురుము - 1 కప్పు
  5. పచ్చిమిర్చి అల్లం వెల్లులి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్
  6. కర్వేపాకు - 2 రెమ్మలు
  7. శనగపిండి - 1 కప్పు
  8. బియ్యంపిండి - 1 కప్పు
  9. సజ్జపిండి - 1 కప్పు
  10. జొన్నపిండి - 1 కప్పు
  11. గోధుమపిండి - 1 కప్పు
  12. బొంబాయి రవ్వ - 2 టేబుల్ స్పూన్
  13. ఉప్పు - 1 టేబుల్ స్పూన్
  14. పసుపు - 1/4 టేబుల్ స్పూన్
  15. ఇంగువ - 1/4 స్పూన్
  16. నువ్వులు - 2 టేబుల్ స్పూన్
  17. పెరుగు - తగినంత
  18. నూనె - తగినంత
  19. ఆవాలు - 1 స్పూన్
  20. జీలకర్ర - 1/2 స్పూన్
  21. దంచిన యండుమిర్చి - 2

సూచనలు

  1. ముందుగా మునగాకులను వలిచి కడిగి ఆరపెట్టుకోవాలి. మెంతికూర & కొత్తిమీర కరివేపాకు కూడా వలిచి కడిగి పెట్టుకోవాలి.సొరకాయను చెక్కు తీసి తురిమి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఒక వెడల్పు ప్లేట్ లో బియ్యంపిండి ,శనగపిండి ,సజ్జపిండి, జొన్నపిండి ,గోధుమపిండి ,బొంబాయి రవ్వ ,ఉప్పు, పసుపు ,ఇంగువ ,నువ్వులు సిద్ధంగా పెట్టుకోవాలి.
  3. పొడి పదార్థాలు అన్ని ఒకసారి కలిసేట్టుగా కలుపుకోవాలి. అందులో మునగాకులు, మెంతిఆకులు, కొత్తిమీర తరుగు ,సోరకాయ తురుము, పచ్చిమిర్చి అల్లం వెల్లులి పేస్ట్ వేసి కలుపుకోవాలి పైన సరిపడా పెరుగు వేసి గట్టిగా కలుపుకోవాలి. కొంచం నూనె కూడా వేసి ముద్ద చేసుకోవాలి.
  4. పిండి ముద్దను మనకి నచ్చిన ఆకారంలో ముద్దను చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ పైన గిన్ని లో నీరు వేసి మరిగాక నూనె రాసిన చిల్లుల ప్లేట్ పెట్టి తయారు చేసిన ముద్ద పెట్టి మూత పెట్టి ఒక 15 నిమిషాలు సన్నని మంటపైన ఉడికించుకోవాలి.
  5. ఉడికిన ముద్దను చల్లారనిచ్చి అరఅంగుళం మందం చక్రాలు లాగ కట్ చేసి పైన నూనె చల్లుకొని పెట్టుకోవాలి.
  6. ఇప్పుడు కడాయి పెట్టి 2 tbsp నూనె వేసి కాగాక ఆవాలు ,నువ్వులు ,జీలకర్ర, కర్వేపాకు ,దంచిన యండుమిర్చి, మునగాకు వేసి వేగనివ్వాలి.
  7. తయారైన ముక్కలను వేసి జాగ్రత్తగా కలుపుకుని రెండు వైపులా దోరగా కాల్చుకొవాలి .
  8. అంతే రుచికరమైన గుజరాతీ స్నాక్ మునగాకు సొరకాయ ముల్తిగ్రైన్ ముథియా రెడీ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర