హోమ్ / వంటకాలు / మునగాకు సర్వపిండి

Photo of Moringa leaves rice flour pan cake by Pravallika Srinivas at BetterButter
601
3
0.0(0)
0

మునగాకు సర్వపిండి

Oct-21-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు సర్వపిండి రెసిపీ గురించి

మునగాకు సర్వపిండి ని మునగాకు బియ్యం పిండి సొరకాయ తురుము మొదలగు దినుసులు మసాలాలు వేసి మొద్ద చేసి వెడల్పు తపాలకి అంటించి ఎర్రగా కాల్చుకోవాలి. ఇది తెలంగాణ ప్రాంతపు అల్పాహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • తెలంగాణ
  • తక్కువ నూనెలో వేయించటం
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • దోరగా వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 3

  1. సొరకాయ తురుము - 1 కప్
  2. మునగాకు - 1 కప్
  3. జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
  4. కర్వేపాకు - 2
  5. కొత్తిమీర - 1 టేబుల్ స్పూన్
  6. ఉప్పు - 1 స్పూన్
  7. పచ్చిమిర్చి అల్లం పేస్ట్ - 1.5 టేబుల్ స్పూన్
  8. పసుపు - 1/4 టేబుల్ స్పూన్
  9. నువ్వులు - 1 టేబుల్ స్పూన్
  10. శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
  11. బియ్యంపిండి - సరిపడా

సూచనలు

  1. ముందుగా మునగాకు గిల్లి కడిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి అల్లం కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
  2. ఒక బేసన్ లో ,సొరకాయ తురుము ,జీలకర్ర, మునగాకు ,కర్వేపాకు ,కొత్తిమీర ,ఉప్పు, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ,పసుపు, నువ్వులు, శనగపప్పు , బియ్యంపిండి వేసి ముద్దలాగా కలుపుకోవాలి.
  3. సొరకాయలోని తేమకు సరిపడా బియ్యం పిండి మాత్రమే వేసుకోవాలి.
  4. ఒక వెడల్పు కడాయిలో నూనె వేసి సరిపడా పిండి ముద్దను వత్తుకొని రంధ్రాలు పెట్టి మూత పెట్టి సన్న మంటపైన ఎర్రగా కాల్చుకోవాలి.
  5. అంతే రుచికరమైన మునగాకు సర్వపిండి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర