హోమ్ / వంటకాలు / హరియాలి వెజిటల్ చాట్

Photo of Green leafy vegetable chaat by Pravallika Srinivas at BetterButter
607
2
0.0(0)
0

హరియాలి వెజిటల్ చాట్

Oct-22-2018
Pravallika Srinivas
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హరియాలి వెజిటల్ చాట్ రెసిపీ గురించి

హరియాలి వెజిటల్ చాట్ లో అన్ని ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలతో మరియు కూరగాయలతో చేస్తాం కాబ్బటి ఆకుపచ్చగా ఉంటుంది.పిల్లలు మాములుగా ఆకుకూరలు బీన్స్ కాప్సికం లాంటివి వేరిపెడతారు ఈ చాట్ లో ఎలా ముక్కలుగా కనిపించవు కాబట్టి చక్కగా తినేస్తారు. మరి ఎలా చేయాలో చూసేదామా ?

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 3

  1. పుదీనా - 1/2 cup
  2. కొత్తిమీర - 1/2 cup
  3. పాలకూర - 1/2 cup
  4. బంగాళాదుంపలు -2
  5. బఠాణీలు - 1 cup
  6. క్యాబేజి తరుగు - 1/4 cup
  7. బీన్స్ తరుగు - 1/4 cup
  8. ఉప్పు - తగినంత
  9. నీరు - తగినంత
  10. పచ్చిమిర్చి - 3
  11. అల్లం - 1 inch
  12. వెన్న - తగినంత
  13. చాట్ మసాలా - 1/2 tbsp
  14. గరం మసాలా - 1/2 tbsp
  15. సేవ్ మిక్సర్ - తగినంత
  16. నిమ్మకాయ - 1

సూచనలు

  1. ముందుగా ఆకుకూరలు పుదీనా కొత్తిమీర పాలకూర కడిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు కుక్కర్ లో బంగాళాదుంపలు, బఠాణీలు, క్యాబేజి, బీన్స్ ,ఉప్పు ,నీరు వేసి 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
  3. ఆవిరి పోయే లోగా పాలకూర ని ఉడికించి వడగట్టి పైనుండి చన్నీళ్ళు వేసి పక్కన పెట్టుకోవాలి.
  4. ఒక మిక్సర్ జార్లో ఉడికించిన పాలకూర కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  5. ఒక కడాయి పెట్టి వెన్న వేసి గ్రైండ్ చేసిన ఆకుకూరల పేస్ట్ వేసి పచ్చిివాసన పోయాక ఉడికించి మెత్తగా మెదిపిన కూరగాయలు, చాట్ మసాలా ,గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి.
  6. కొంచం దగ్గర పడ్డాక ఒక ప్లేట్స్లో తీస్కుని పైనుండి సేవ్ మిక్సర్ చల్లుకుని నిమ్మకాయ పిండుకుని తింటే చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర