హోమ్ / వంటకాలు / మునగాకు రైస్

Photo of Drumstick leaves rice by రమ్య వూటుకూరి at BetterButter
578
1
0.0(0)
0

మునగాకు రైస్

Oct-23-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు రైస్ రెసిపీ గురించి

విటమిన్ ఎ సి సంవృద్ది గా లబించే మునగాకు ఎక్కువగా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎప్పుడూ రొటీన్ పప్పు పచ్చడే కాకుండా ఇలా వెరైటీ గా ట్ర్య్ చేసి చూడండి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. మునగాకు 1 కప్
  2. వండిన అన్నం 1 కప్
  3. పోపుగింజలు 4 స్పూన్స్
  4. ఇంగువ 1/4 స్పూన్
  5. పసుపు చిటికెడు
  6. ఉప్పు తగినంత
  7. ఎండుమిర్చి 8
  8. వెళ్ల్లుల్లి రెబ్బలు 4
  9. ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్
  10. పల్లీలు 3 స్పూన్స్
  11. జీడిపప్పు 1 స్పూన్
  12. నిమ్మరసం 2 స్పూన్స్

సూచనలు

  1. అన్నం వండి ఉంచుకోవాలి
  2. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేస్కొని పల్లీలు జీడిపప్పు వేయించి పెట్టుకోవాలి
  3. అదే బాండీ లో పోపుగింజలు ఇంగువ ఎండుమిర్చి వేసి బాగా వేయించాలి
  4. పోపు వేగాక మునగాకు కూడా వేసి బాగా వెయి0చుకోవాలి
  5. చల్లారాక మిక్సీ లో వేసి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పొడి చేసుకోవాలి
  6. మరీ మెత్తగాకాకుండా పొడి చేసుకోవాలి
  7. బాండీ లో మిగిలిన ఆయిల్ వేసుకొని ఈ పొడి వేసి 2 మినిట్స్ వేయించాలి
  8. దీనిలో ఉప్పు పసుపు అన్నం వేసి బాగా కలపాలి
  9. వేయించి ఉంచుకున్న పల్లీలు జీడిపప్పు వేసి కలిపి 2 మినిట్స్ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  10. నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వ్ చేస్కోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర