హోమ్ / వంటకాలు / మునగాకు కూటు

Photo of Moringa leaves kootu  by Divya Konduri at BetterButter
498
2
0.0(0)
0

మునగాకు కూటు

Oct-24-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు కూటు రెసిపీ గురించి

మునగ ఆకులు కొంచెం కొత్తగా చేద్దాము అని పప్పు వేసి కొబ్బరి తో కూటూ చేసి రైస్ బౌల్ లో పెట్టి సర్వ్ చేసాను

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మునగ ఆకు 1కప్పు
  2. పెసర పప్పు ఒక కప్పు
  3. కొబ్బరి తురుము అర కప్పు
  4. ఎండుమిరపకాయలు 4
  5. ధనియాల పొడి ఒక స్పూను
  6. టమాట ముక్కలు అర కప్పు
  7. ఉప్పు తగినంత
  8. పచ్చి మిరపకాయలు 2
  9. పసుపు చిటికెడు
  10. ఇంగువ పావు స్పూను
  11. ఆవాలు అర స్పూను
  12. జీలకర్ర అర స్పూను
  13. నూనె పావు కప్పు
  14. ఉడికించిన అన్నం 1 కప్పు

సూచనలు

  1. పెసర పప్పుని కడిగి 20నిమిషాలు నాన పెట్టాలి
  2. మునగ ఆకులు వలిచి కడిగి ఉంచాలి
  3. కుక్కరు గిన్నెలో పప్పు,ఆకులు ,పసుపు వేసుకొని ఉడికించుకోవాలి
  4. బాండీలో నూనె వేసి ఆవాలు , జీలకర్ర, ఇంగువ వేసి వేగిన తరువాత ఉల్లి తరుగు, దంచిన వెల్లుల్లి వేసి వేగించాలలి
  5. ఆ పైన టమాట ముక్కలు వేసి మగ్గించాలి .
  6. టమాటాలు మెత్తబడ్డాక కుక్కరు లోని మునగ ఆకు , పప్పు మిశ్రమాన్ని బాండీలో వేసుకోవాలి
  7. ఇప్పుడు మిక్సీ జారులో కొబ్బరి, ఎండుమిరపకాయలు వేసుకొని మెత్తగా రుబ్బాలి
  8. అది పప్పు లో వేసి సరిపడ ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి
  9. అన్నం తీసుకొని బౌల్ ఆకారం చేసి మద్యలో మునగ కూటు సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర