హోమ్ / వంటకాలు / తాళింపు గోంగూర

Photo of sorrel leaves  Stir fry by Pravallika Srinivas at BetterButter
848
2
0.0(0)
0

తాళింపు గోంగూర

Oct-26-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తాళింపు గోంగూర రెసిపీ గురించి

గోంగూర పచ్చడి అంటే.. తెలుగువాళ్లకు ఏంతో ప్రీతికరం. పుల్లపుల్లగా.. నోరూరించే రుచి గోంగూర సొంతం. పచ్చడి చేసినా ఊరగాయపట్టినా పప్పు చేసినా కూరల్లో జోడించినా... ఆ రుచి అమోఘంగా ఉంటుంది. గోంగూర ఇష్టపడని వాళ్లు బహుషా ఉండరేమో.అందుకే గోంగూరను ఆంధ్రమాత అంటారు .. ఏ కూరగాయల్లో వేసిన మంచి రుచినిచ్చే గోంగూరలో ఎన్నో పోషక విలువలున్నాయి.ఇందులో విటమిన్ సి ఎ బి౬ తో పాటు ఐరన్ మెగ్నీషియం పొటాషియం కాల్షియం పుష్కలంగా ఉన్నాయి.తాలింపు గోంగూర తయారీ విధానం చూసేద్దామా ?

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • దోరగా వేయించటం
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. గోంగూర - 1 కట్ట
  2. నూనె - 4 స్పూన్లు
  3. పోపు దినుసులు - 2 స్పూన్లు
  4. పచ్చిపప్పు - 2 స్పూన్లు
  5. కర్వేపాకు - 2 రెమ్మలు
  6. యండుమిర్చి - 4
  7. పసుపు - 1/4 స్పూన్
  8. ఇంగువ - 1/4 స్పూన్
  9. ఉల్లితరుగు - 2
  10. ఉప్పు - 1 స్పూన్
  11. వెల్లుల్లి కారం - 2.5 పెద్ద స్పూన్లు

సూచనలు

  1. ముందుగా గోంగూర కట్టాను తీస్కుని ఆకుని గిల్లి కడిగి నీడలో ఒక రోజు అంతా ఆకులను వడలనివ్వాలి.
  2. ఇప్పుడు గోంగూర ,ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలి.
  3. కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు ,పచ్చిపప్పు, కర్వేపాకు, యండుమిర్చి ,పసుపు ,ఇంగువ వేసి వేగాక ఉల్లితరుగు వేసి దోరగా వేయించుకోవాలి.
  4. ఇప్పుడు గోంగూర కూడా వేసి బాగా కలుపుకోవాలి.
  5. గోంగూర అంతా వేగాక ఉప్పు ,వెల్లుల్లి కారం వేసి మరికొంత సమయం వేగనివ్వాలి.
  6. నూనె వదిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  7. అంతే రుచికరమైన తాలింపు గోంగూర రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర