హోమ్ / వంటకాలు / తులసి ఆకుల కిచిడి

Photo of Basil leaves Kichidi by Pravallika Srinivas at BetterButter
417
2
0.0(0)
0

తులసి ఆకుల కిచిడి

Oct-27-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తులసి ఆకుల కిచిడి రెసిపీ గురించి

తులసి ఆకు చాలా పవిత్రంగా పూజిస్తాం .అందులో ఉన్న ఉపయోగాలు అన్ని ఇన్ని కావు .రోగనిరోధకశక్తిని పెంచుతుంది. చాలా రకాల వైరస్లకు తులసి యాంటీబయాటిక్ గా పని చేస్తుంది. ప్రతి రోజు కొన్ని తులసి ఆకులు సేవించడం చాలా మంచిది. ఆలా కుదరని పక్షంలో ఇలాంటి వంటలు చేస్కునే తింటే మంచి పోషకాలు అందుతాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. తులసి ఆకులు - 1 కప్పు
  2. బియ్యం - 1 కప్పు
  3. పెసరపప్పు - 1/2 కప్పు
  4. నూనె - 3 స్పూన్లు
  5. పోపుదినుసులు - 1 స్పూన్
  6. యండుమిర్చి - 2
  7. ఇంగువ - 1/4 స్పూన్
  8. పచ్చిమిర్చి - 4
  9. అల్లం- 1 అంగుళం ముక్క
  10. ఉప్పు - 1స్పూన్
  11. పసుపు - 1/4 స్పూన్

సూచనలు

  1. ముందుగా తులసి ఆకులు కడిగి పెట్టుకోవాలి.
  2. బియ్యం పెసరపప్పు కలిపి కడిగి పెట్టుకోవాలి.
  3. ఒక కుక్కర్ పెట్టి నూనె వేసి కాగాకా పప్పుదినుసులు యండుమిర్చి ఇంగువ వేసి చిటపటలాడాక కడిగిన పప్పూబియ్యం వేసి కలిపి ఉప్పు పసుపు వేసి 4 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
  4. ఈలోగా మిక్సర్ జార్ లో తులసి ఆకులు పచ్చిమిర్చి అల్లం వేసి పేస్ట్ చేసుకోవాలి.
  5. కుక్కర్ మూత తీసి ఈ పేస్ట్ కూడా వేసి దగ్గరగా ఉడికించుకోవాలి.
  6. పైనుండి కొంచం నెయ్యి వేస్కుని తింటే చాలా రుచిగా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర