మునగాకు సాంబార్ | Moringa Sambar Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  28th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Moringa Sambar by Pravallika Srinivas at BetterButter
మునగాకు సాంబార్by Pravallika Srinivas
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

3

0

మునగాకు సాంబార్ వంటకం

మునగాకు సాంబార్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Moringa Sambar Recipe in Telugu )

  • మునగాకు - 1 కప్పు
  • ఛాయపెసరపప్పు - 1 కప్పు
  • టమాటో ముక్కలు - 1/2 కప్పు
  • ఉల్లిపాయ - 1
  • క్యారట్ - 1
  • బెండకాయలు - 10
  • బంగాళాదుంప - 1
  • ఉప్పు - 1 చెంచా
  • నీరు - తగినంత
  • పసుపు - 1/4 స్పూను
  • సాంబార్ పొడి - 1 చెంచా
  • నూనె - 2 స్పూన్లు
  • పోపు దినుసులు - 1 స్పూన్
  • కర్వేపాకు - 1 రెమ్మ
  • యండుమిర్చి - 3
  • ఇంగువ - 1/4 స్పూన్

మునగాకు సాంబార్ | How to make Moringa Sambar Recipe in Telugu

  1. ముందుగా మునగాకు వలిచి కడిగి పెట్టుకోవాలి.
  2. ఛాయపెసరపప్పు కూడా కడిగి పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు కుక్కర్ లో కడిగిన పెసరపప్పు, టమాటో ముక్కలు ,ఉల్లిపాయ ముక్కలు, క్యారట్ ముక్కలు, బెండకాయలు ,బంగాళాదుంప ముక్కలు, ఉప్పు ,నీరు వేసి 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
  4. ఇప్పుడు పసుపు ,సాంబార్ పొడి, మునగాకు ,తగినన్ని నీరు,బెల్లం, ఉప్పు వేసి బాగా మరిగించుకోవాలి.
  5. ఇప్పుడు కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు కర్వేపాకు యండుమిర్చి ఇంగువ వేసి చిటపటలాడాక సాంబార్ లో వేసుకోవాలి.
  6. అంతే రుచికరమైన మునగాకు సాంబార్ రెడీ

నా చిట్కా:

లేత మునగాకు తీసుకోవడం వలన త్వరగా ఉడికిపోతుంది.

Reviews for Moringa Sambar Recipe in Telugu (0)