హోమ్ / వంటకాలు / మెంతికూర ఆలుగడ్డ కూర

Photo of Fenugreek leaves Potatoes Curry by Pravallika Srinivas at BetterButter
539
2
0.0(0)
0

మెంతికూర ఆలుగడ్డ కూర

Oct-29-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతికూర ఆలుగడ్డ కూర రెసిపీ గురించి

మెంతికూర ఆలుగడ్డ కూర అన్నం లోకి చపాతీ లోకి చాలా బాగుంటుంది ఇందులో వాడిన మెంతికూర పచ్చిది కాదు యండబెట్టిన మెంతికూర దీనినే కాసురి మేతి అని కూడా అనవచ్చు. ఎక్కువ ఏ కూరలు నిల్వ ఉండవు మనకి ఆపద్ధర్మ కూరగాయ బంగాళాదుంప .ఇలా కసూరి మేతి కూడా తయారు చేసి పెట్టుకుంటే అవసరమైనపుడు ఉపయోగించవచ్చు. మరి ఈ మేతి ఆలూ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ?

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • ఆవిరికి
  • సైడ్ డిషెస్
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 3

  1. కసూరి మేథి - 6 చెంచాలు
  2. ఆలూ - 250 గ్రాములు
  3. ఉల్లిపాయలు - 2
  4. నూనె - 2 చెంచాలు
  5. పోపు దినుసులు - 1 చెంచా
  6. పచ్చిపప్పు - 1 స్పూన్
  7. ఇంగువ - 1/8 స్పూన్
  8. ఎండుమిర్చి - 3
  9. ఉప్పు - 1 స్పూన్
  10. పసుపు - 1/4 స్పూన్
  11. నీరు - తగినంత
  12. అల్లం - 1 అంగుళం ముక్క
  13. వెల్లుల్లికారం - 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా కసూరి మేథిని నీటిలో వేసి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు నీళ్లు పిండి వేరొక గిన్నెలో తీసుకోవాలి.
  3. ఆలూ ,ఉల్లిపాయలు ని కడిగి తొక్కు తీసి కొంచం పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు కడై పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు, పచ్చిపప్పు, యండుమిర్చి ,ఇంగువ వేసి చిటపటలాడాక ఉల్లితరుగు, ఆలూ ముక్కలు ,ఉప్పు ,పసుపు వేసి కలుపుకోవాలి.
  5. పైన ఒక గుంతగా ఉన్న ప్లేట్ లో నీరు పోసి దానిని కడాయి మీద పెట్టి ఆవిరికి ఉడికించుకోవాలి.
  6. మద్యమద్యలో కలుపుతూ ఉండాలి. ఆలూ మెత్తగా ఉడికిన తర్వాత మెంతికూర కూర వేసి కలుపుకోవాలి.
  7. మరొకసారి మూతపెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు అల్లం తురుము ,వెల్లులికారం వేసి కలుపుకోవాలి.
  8. కొంచం వేపిన తర్వాత కూర నూనె విడవగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  9. అంతే మేతి ఆలూ కూర రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర