హోమ్ / వంటకాలు / పుదీనా దొండపండు బజ్జి

Photo of Mint Riped ivygourd Chutney by Pravallika Srinivas at BetterButter
474
1
0.0(0)
0

పుదీనా దొండపండు బజ్జి

Oct-29-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీనా దొండపండు బజ్జి రెసిపీ గురించి

దొండకాయలను పండినప్పుడు పుల్లగా ఉంటాయి అని పడేస్తూ ఉంటారు. ఈ విధంగా పుదీనా పండిన దొండకాయలు కలిపి మగ్గనిచ్చి చట్నీ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. దొండపండు - 150 గ్రాములు
  2. పుదీనా - పావు కట్ట
  3. నూనె - 2 స్పూన్లు
  4. పోపు దినుసులు - 1 స్పూన్
  5. పచ్చిమిర్చి - 6
  6. టమాటో - 1
  7. ఉప్పు - 1 స్పూన్
  8. పసుపు - 1/4 స్పూన్
  9. కొత్తిమీర - 4 రెమ్మలు
  10. చింతపండు - 2 రేకులు

సూచనలు

  1. ముందుగా దొండకాయలను కడిగి నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
  2. పుదీనా వలిచి కడిగి పెట్టుకోవాలి. టమాటో తరిగి పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు ఒక కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు, తుంచిన పచ్చిమిర్చి ,దొండకాయ ముక్కలు ,ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి.
  4. మూత పెట్టి సన్నని మంటపైన మగ్గిన తర్వాత పుదీనా, కొత్తిమీర ,టమాటో ముక్కలు, చింతపండు వేసి కలిపి మరి కొంచం సమయం మగ్గనివ్వాలి.
  5. ముక్కలుఅన్నీ మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి.
  6. ఇప్పుడు రోట్లో వేసి కొంచం ముక్కలు తగిలేవిధంగా రుబ్బుకుని ఒక గిన్నిలోకి తోడుకోవాలి.
  7. పైన పుదీనా కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే పుదీనా దొండపండు పచ్చడి రెడీ ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర