హోమ్ / వంటకాలు / పాలక్ మరియు చీజ్ ఫ్రిట్టేర్స్

Photo of Palak and cheese fritters by Shobha.. Vrudhulla at BetterButter
483
0
0.0(0)
0

పాలక్ మరియు చీజ్ ఫ్రిట్టేర్స్

Oct-29-2018
Shobha.. Vrudhulla
20 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ మరియు చీజ్ ఫ్రిట్టేర్స్ రెసిపీ గురించి

పాలకూర చాలామంది పిల్లలకు నచ్చదు.ఏవైనా కలిపి వండితే అప్పుడే తింటారు.పాలకూర అన్నిరకాలుగా వంటికి మంచిది.అందుకే అందులో చీజ్ పెట్టి చేస్తే మంచి రుచిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్తంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • పంజాబీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పాలకూర పెద్ద ఆకులు 10
  2. చీజ్ ఐదు ముక్కలు
  3. మైదా 1 కప్పు
  4. మిరియాల పొడి 1 చెంచా
  5. ఉప్పు తగినంత
  6. నూనె మూడు కప్పులు
  7. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా పాలకూర పెద్ద ఆకులు తీసుకొని బాగా కడిగి పెట్టాలి
  2. తరువాత స్టవ్ మీద నీళ్లు పెట్టి మరుగుతున్నప్పుడు ఈ పాలకూర ని ఆ నీళ్ళల్లో వేసి ఒక నిమిషం వరకు ఉంచి వెంటనే తీసి చల్లని ఐస్ నీళ్ళల్లో వేయాలి
  3. యిలా పాలకూర ని ఫ్లాష్ కుక్ చేయటం వల్ల ఎక్కువగా మెత్తపడదు మరియు కలర్ కూడా అలానే పచ్చ గా బాగా ఉంటుంది
  4. నీళ్లలోంచి తీసి ఒక కాటన్ గుడ్డ మీద విడివిడిగా పరుచుకోవాలి .ఇలా పెట్టటం వల్ల ఆకులు అంటుకోకుండా విడిగా ఉంటాయి మరియు పొడి గుడ్డ నీటిని పీలుస్తుంది
  5. ఇప్పుడు ఒక బౌల్ లో మైదా వేసి అందులో మిరియాల పొడి మరియు ఉప్పు వేసి బాగా ఉండలు లేకుండా జారుగా కలుపుకొని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి
  6. ఇప్పుడు పాలకూర ఆకులు ఒక్కొక్కటి ముడికలు తీసి పెట్టాలి
  7. చీజ్ ని నాలుగు ముక్కలుగా చేసుకోవాలి
  8. ఇప్పుడు ఒక పాల కూర ఆకుని తీసుకొని దానిమీద ఒక చీజ్ ముక్కని పెట్టి జాగ్రత్తగా కవర్ చేయాలి
  9. మొత్తం అన్ని వైపులా ముడుచుకొని విడిపోకుండా చూసుకోవాలి
  10. ఒకవేళ విడిపోతుంది అనే అనుమానం ఉంటే విడకుండా ఉండేలా టూత్పిక్ ని గుచ్చి పక్కన పెట్టాలి. ఇదే విధంగా మీరు ఎన్ని ఆకులు తో చేయాలంటే అన్ని చేసుకో వచ్చును
  11. స్టవ్ మీద ముకుడు పెట్టి నూనె పోసుకోవాలి డీపీఫ్రై కోసము
  12. బాగా మరిగిపోతే నూనె పాలక చీజ్ వేసే సరికి మాడిపోతాయి . కాబట్టి మీడియం గా వేడెక్కితే చాలు.
  13. నూనె వేడియాక అందులో పాలక్ చీజ్ ని తయారుగా ఉంచిన మైదా బెటర్ లో ముంచుతూ ఒక్కొక్కటి నూనెలో వేసి కరకరలాడుతూ వేగాక తీసి పేపర్ మీద పెట్టుకోవలెను.
  14. అదే విధానంగా అన్ని చేసి పెట్టుకోవటమే.. అన్ని అయ్యాక ఆఖరికి వాటిలోంచి పుల్లలు తీసుకోవాలి
  15. అంతే ఎంతో రుచికరమయిన పాలక మరియు చీజ్ ఫ్రిట్టేర్స్ తయారు
  16. టమాట చిల్లీ సాస్ తో కానీ గార్లిక్ మయోనైజ్ సాస్ తో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి క్రిస్పీ గా .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర