హోమ్ / వంటకాలు / ఆకు కూరల పకోడీ

Photo of Mixed Greens pakora by Shobha.. Vrudhulla at BetterButter
214
1
0.0(0)
0

ఆకు కూరల పకోడీ

Oct-29-2018
Shobha.. Vrudhulla
45 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆకు కూరల పకోడీ రెసిపీ గురించి

పాలకూర, మెంతి ఆకు, పుదీనా , కొత్తిమీర, ముల్లంగి ఆకు, కరివేపాకు, ఆవ ఆకు(సరూశోక పత్తా) అన్ని కురలతో పకోడీ ఇది ఒక వెరైటీ వంట . అన్నిరకాల ఆకు కూరలు కలిసాయి కనుక పౌష్టికారమైన ఆహారము. చాలా రుచిగాను కరకర లాడుతూ ఉంటాయి.పిల్లలకి పెద్దలకు కూడా నచ్చుతుంది .

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • పిల్లలకు నచ్చే వంటలు
 • పంజాబీ
 • వేయించేవి
 • చిరు తిండి
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

 1. పాలకూర 2 కప్పులు
 2. మెంతి కూర 1 కప్పు
 3. ముల్లంగి ఆకు 1 కప్పు
 4. కొత్తిమీర 1/2 కప్పు
 5. పుదీనా 1/4 కప్పు
 6. కరివేపాకు 1/4 కప్పు
 7. అవా ఆకు ( సర్సొన్ ఆకు) 1/4 కప్పు
 8. ఉల్లిపాయలు 3
 9. పచ్చిమిరపకాయలు 4
 10. మైదా 2 కప్పులు
 11. వరిపిండి 1 కప్పు
 12. గోధుమనూక 3 చంచాలు
 13. ఉప్పు తగినంత
 14. కారము 3 స్పూన్లు లేదా తగినంత
 15. పసుపు 1/4 స్పూన్
 16. వాము 1 చెంచా
 17. చాట్ మసాలా పొడి 1/4 స్పూను
 18. నూనె వేయించటానికి సరిపడా

సూచనలు

 1. ముందుగా మెంతి కూర బాగా వలిచి పడకలు లేకుండా ఇసుక లేకుండా కడిగి ఒక గిన్నెలో వేడినీళ్లు పోసి అందులో ఉప్పు వేసి ఒక పావు గంట నానపెట్టి ఉంచాలి. దీని వలన మెంతి కూర చేదు తగ్గుతుంది
 2. అదే విధంగా అన్ని ఆకు కూరలు కూడా పడకలు చెత్త లేకుండా వలిచి బాగా కడగాలి
 3. కడిగిన తరువాత నీరు బాగా వొడ్చి అప్పుడు చక్కగా చిన్న చిన్న ముక్కలుగా తరగాలి
 4. ఉల్లిపాయలు కూడా పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మధ్య రకంగా మనకు నచినట్టుగా తరిగి ఉంచుకోవాలి
 5. పచ్చి మిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి
 6. అల్లం వెల్లుల్లి ముద్ద ఒక చెంచా దంచి ఉంచుకోవాలి. ఆకు కురాలకి అల్లం మరియు వెల్లుల్లి కలిపితే మంచి రుచి వస్తాయి
 7. ఇప్పుడు మెంతి ఆకు బాగా పిండి నానబెట్టిన నీటిలోంచి తీసుకోవాలి . నీరు ఉంటే మళ్ళీ చేదుతనము వస్తుంది .అందుకే నీళ్లు బాగా పిండియాలి
 8. ఆ మెంతి ఆకు కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచాలి
 9. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో తరిగి ఉంచిన ఆకు కూరలు అన్ని వేసుకొని , ఉల్లిపాయలు కూడా వేసి బాగా కలియబెట్టాలి
 10. ఈ కూరల్లో మైదా,వరిపిండి,గోధుమ నూక,ఉప్పు,పసుపు,కారము,అల్లం వెల్లుల్లి ముద్ద,వాము,చాట్ మసాలా పొడి అన్ని పదార్ధాలు వేసి బాగా కింద మీద కలిపి రెండు నిమిషాలు పక్కన పెట్టాలి
 11. ఎందుకంటే ఆకుకురాల్లో ఉప్పు వేశక నీరు వదుల్తుంది. ఇప్పుడు మరోసారి కలిపి ఆప్పుడు అందులో కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ బాగా కలియ పెట్టాలి
 12. మరి గట్టిగా కలప కూడదు ముద్దని.
 13. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేసి కగానివ్వాలి
 14. మంటని మీడియం లో ఉంచి నూనెని వేడక్కనివ్వాలి .
 15. అప్పుడు మనకు నచ్చినట్టు ముద్దని నూనెలో వేసి , బాగా కరకరలాడేంత వరకు వేయించి తీసేయటమే
 16. ఇందులో గోధుమ నూక వేయటం వల్ల కూడా కర కర లాడుతూ ఉంటాయి
 17. అంతే కరకరలాడే ఉల్లి మరియు ఆకు కూరలతో పకోడీలు తయారు. వేడి వేడిగా నచ్చిన సాస్ తో తినొచ్చు.
 18. ఈ ఆకు కూరలు యి చలి కాలంలో తింటే ఒంట్లో వేడి పెరిగి ఎన్నో వ్యాధులను నిరోధిస్తుంది కూడా.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర