హోమ్ / వంటకాలు / కొత్తిమీర ఓట్స్ క్రిస్పీ క్రిస్పీ స్నాక్స్

Photo of coriander crispy snacks  by Kavitha Perumareddy at BetterButter
555
3
0.0(0)
3

కొత్తిమీర ఓట్స్ క్రిస్పీ క్రిస్పీ స్నాక్స్

Oct-31-2018
Kavitha Perumareddy
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర ఓట్స్ క్రిస్పీ క్రిస్పీ స్నాక్స్ రెసిపీ గురించి

ఈ స్నాక్ చేసుకోవడం చాలా సులభం. ఇంకా చాలా రుచిగా పోషకాలు కలిగి ఉంటుంది. ఇలాంటి స్నాక్స్ చేసిపెడితే పిల్లలు ఇష్టంగా తింటారు ...టీ టైములో తినడానికి చాలా బాగుంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. కొత్తిమీర ఒక కప్
  2. గోధుమపిండి ఒక కప్
  3. ఓట్స్ సగం కప్
  4. పల్లిపొడి నాలుగు స్పూన్స్
  5. ఎండుమిర్చి ప్లేక్స్ 2స్పూన్స్
  6. జీలకర్ర స్పున్
  7. కరివేపాకు గుప్పెడు
  8. ఉప్పు తగినంత
  9. నూనె డీప్ ప్రై కు సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో గోధుమపిండి, ఓట్స్,పల్లిపొడి, తగినంత ఉప్పు, ఎండుమిర్చి ప్లేక్స్, జీలకర్ర, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేసి అంత కలిసేలా కలిపి తరువాత తగినన్ని నీళ్లుపోసి ముద్దలా కలుపుకోవాలి, పిండి నాననివ్వకూడదు. వెంటనే చేసుకోవాలి .ఎందుకంటే ఓట్స్ నానిపోకుండా క్రిస్పీగా ఉంటాయి .ఓట్స్ పొడి చేయకూడదు అలాగే వేసుకోవాలి .అప్పుడే క్రిస్పీ గా ఉంటాయి.
  2. తరువాత పిండిని మూడు భాగాలు చేసుకొని...ముందుగా ఒక భాగం తీసుకొని చెపాతి లా ఒత్తుకొని త్రిభుజాకారంలో కట్ చేసుకోవాలి.
  3. ముక్కల మధ్యలో ఇలా గాట్లు పెడితే ఎక్కువగా పొంగకుండా క్రిస్పీ గా వేగుతాయి .
  4. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి వేయించడానికి సరిపడా నూనె వేసి కాగనిచ్చి ఈ ముక్కలు వేసి క్రిస్పీ గా వేయించుకోవాలి.
  5. అన్ని సమానంగా ఒకేలా వేయించుకొంటే బాగుంటాయి ..
  6. చల్లారిన తరువాత డబ్బాలో వేసుకొని నిలువ చేసుకుంటే 10 రోజుల వరకు ఉంటాయి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర