హోమ్ / వంటకాలు / పొన్నాగంటి ఆకు పొంగలి

Photo of Hot pongal with Alternanthera sessilis by Swapna Tirumamidi at BetterButter
626
1
0.0(0)
0

పొన్నాగంటి ఆకు పొంగలి

Oct-31-2018
Swapna Tirumamidi
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పొన్నాగంటి ఆకు పొంగలి రెసిపీ గురించి

ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ 'ఎ', 'బి6', 'సి', ఫొలేట్, 'రైబోఫ్లెవిన్', పొటాషియం, ఇనుము, మెగ్నీషియం దీన్నుంచి సమృద్ధిగా దొరకుతాయి. గోధుమ పిండి, బియ్యం, ఓట్స్‌లో కంటే ముప్ఫై శాతం ఎక్కువగా ప్రొటీన్లు అందుతాయి. అమినో ఆమ్లాలూ శరీరానికి లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకు కూరను తరచూ తింటే మంచిది. ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి, గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడతాయి. ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది. దీన్లో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది. ఈ ఆకుల్లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. గౌట్, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతోనే దీన్ని తీసుకోవాలి. ఒకసారి కూర చేశాక పదే పదే వేడి చేయడం సరికాదు. ఒక్కోసారి వికారానికి దారి తీసే ప్రమాదం ఉంది.ఈ వివరాలన్నీ నెట్ లోంచి సేకరించినవే...అసలు దీనికి ఈ పేరుఎలా వచ్చిందో తెలుసా..."పోయిన కంటి చూపును కూడా తిరిగి తెప్పించిగలదు..కాబట్టి "పోయిన కంటి కూర "అనేవారు.కాలక్రమంలో "పొన్నంగటి కూర"గా అయిపోయింది. ఈ పొంగలి కూడా నా సొంత వంటవిధానం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. బియ్యం 1 కప్పు.
  2. పొట్టు పెసరపప్పు అర కప్పు
  3. పొన్నగంటి కూర రెండున్నర కప్పులు
  4. నెయ్యి 5 చెంచాలు
  5. ఆవాలు పావు టీ స్పూన్
  6. జీలకర్ర అర టీ స్పూన్
  7. జీడిపప్పులు రెండు గుప్పెళ్ళు.
  8. పచ్చిమిర్చి 4.
  9. ఎండుమిర్చి 3
  10. అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు
  11. మిరియాలపొడి(కచ్చపచ్చగా దంచినది)అర టీ స్పూన్
  12. కరివేపాకు గుప్పెడు
  13. ఇంగువ అర టీ స్పూన్
  14. పసుపు చిటికెడు.
  15. ఉప్పు రుచికి తగినంత.

సూచనలు

  1. పొన్నంగటి కూరని శుభ్రంగా బాగుచేసి కడిగి ఆకులు తుంచిపెట్టుకోవాలి.
  2. ఇప్పుడు బియ్యం పెసరపప్పు కడిగి ప్రెజర్ పాన్లో 4 కప్పులనీళ్లు పోసి పొయ్యిమీద పెట్టి మంట కాస్త చిన్నగా ఉంచాలి. మూత పెట్టకుండా ఉండాలి. ఉడికెలోపు...
  3. వేరే పొయ్యిమీద మూకుడు పెట్టి నెయ్యివేసి కాగాక ఆవాలు..జీలకర్ర...జీడిపప్పు.. మిరియాలు/మిరియంపొడి...వేసి వేయించి...అల్లంముక్కలు... పచ్చిమిర్చి..ఎండుమిర్చి...కరివేపాకు..ఇంగువ ..పసుపు ...వేసి కమ్మగావేగనివ్వాలి.
  4. అన్నీ వేగాక బాగుచేసిన పొన్నంగటి కూర వేసి ఉప్పు వేసి పచ్చివాసన పోయేదాక వేగనివ్వాలి...
  5. ఇలా వేపిన ఆకుముద్దని సగం ఉడుకుతున్న పెసరపప్పుఅన్నంలో వేసి అంతటా కలిసేలా కలిపి ,ఉప్పు సరిచూసుకోవాలి.
  6. ఇప్పుడు ప్రెజర్ పాన్ మూత పెట్టి 2 కూతలు వచ్చే వరకూ ఉంచి పొయ్యిమీద మీదనుంచి దించుకోవాలి..
  7. మూత వచ్చే దాకా ఉండి...చివరగా 2 చెంచాల నెయ్యివేసి కిందనుంచి బాగా కలిపి వడ్డించుకోడమే.
  8. ఇది చాలా చక్కగా ఉంది రుచి.అంతకుమించిన ఆరోగ్యము కూడా..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర