హోమ్ / వంటకాలు / హరా భరా కబాబ్.

Photo of Green veg katlets by Swapna Tirumamidi at BetterButter
477
1
0.0(0)
0

హరా భరా కబాబ్.

Nov-01-2018
Swapna Tirumamidi
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హరా భరా కబాబ్. రెసిపీ గురించి

పచ్చని ఆకుకూర,పచ్చని కూరలతో చేస్తాము కాబట్టి హరాభరా కబాబ్ అంటాము..ఇది టైం ఉంటే పిల్లలకు ఉదయం ఫలహారంగా చెయ్యచ్చు...లేదా సాయంసమయాల్లో చిరుతిళ్ళు గా చేసుకోవచ్చు..ఆరోగ్యం కూడా.

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఉత్తర భారతీయ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. పాలకూర పెద్దకట్ట ఒకటి
  2. 1 క్యాప్సికమ్ తరుగు
  3. బీన్స్ తరుగు ముప్పావు కప్
  4. గ్రీన్ పీస్ ముప్పావు కప్
  5. 2 బంగాళదుంపలు ఉడికించిన ముద్ద
  6. పన్నీర్ తురుము 1 కప్
  7. పచ్చిమిర్చి ఒకటి/ రెండు
  8. కొత్తిమీర తురుము అర కప్
  9. కార్న్ ఫ్లోర్ 1 చెంచా
  10. బ్రెడ్ పొడి 2 చెంచాలు
  11. కారం ఒక చెంచా.
  12. ధనియాల పొడి అర చెంచా
  13. ఆమ్ చూర్ 1 చెంచా
  14. గరంమసాలా పొడి అర చెంచా
  15. పసుపు 2 చిటికెళ్ళు
  16. ఉప్పు సరిపడా
  17. బ్రెడ్ పొడి ఒక కప్ బైండింగ్ కోసం.
  18. జీడిపప్పు బద్దలు 10 నుంచి 15.
  19. నూనె డీప్ ఫ్రై చెయ్యడానికి తగినంత.

సూచనలు

  1. పాలకూరని శుభ్రంచేసి,కడిగి,2 నిమిషాలు ఉడికించి మిక్సీలో మెత్తగా చేసి పట్టుకోవాలి.
  2. మూకుడుపెట్టి 2 చెంచాల నూని వేసి వేడిచేసి...పచ్చి మిర్చి,క్యాప్సికమ్ తరుగు, బీన్స్ తరుగు,గ్రీన్ పీస్,వేసి వేయించాలి.
  3. ఇప్పుడు పాలకూర ముద్దలో ఈ వేయించిన ముక్కలు కూడా వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి.అసలు నీరు వెయ్య కూడదు.
  4. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక పెద్దగిన్నిలోకి తీసికొని.... అందులో ఉడికించిన ఆలూ ముద్ద,పన్నీర్ తురుము,కొత్తిమీర తురుము,1 చెంచా కార్న్ ఫ్లోర్,2 చెంచాల బ్రెడ్ పొడి,ధనియాలపొడి,గరం మసాలా పొడి,కారం,పసుపు,ఉప్పు,ఆమె చూర్...అన్నీ వేసి బాగా కలిసేట్టుగా కలిపి పెట్టుకోవాలి.
  5. ఇప్పుడు ఇలా కలిపిన మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయ పరిమాణం లో ఉండలు చేసి అరచేతిలో పెట్టుకుని వడలు/కట్లెట్స్ లాగా చెయ్యాలి.
  6. ఇప్పుడు వేరే ప్లాటిలోకి ఒక కప్ బ్రెడ్ పొడి వేసి తయారుచేసిన కట్లెట్స్ ని అద్ది బ్రెడ్ పొడి తో కవర్ చేసి, మధ్యలో పైకి కనిపించే విధంగా జీడిపప్పును అద్దాలి.
  7. ఇప్పుడు దేవడానికి సరిపడే అంత నూనె మూకుడులో పోసి కాగాక... నాలుగేసి కబాబుల చప్పున నూనెలో జాగర్తగా వేయించి,కొద్దిగా ఎరుపు రంగు రాగానే బయటకు తీసి టిష్యూ పేపర్ మీదకి తీసి పెట్టుకోవాలి.
  8. అంతే వేడివేడి చక్కటి కమ్మటి హరా భారా కబాబ్ రెడీ మరి....గ్రీన్ చట్నీ ,సన్నగతరిగిన వెజ్ సలాడ్ తో ప్లేటింగ్ చేస్తే అద్భుతః:ok_hand::ok_hand::ok_hand::wink:.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర