తోటకూర బరడ | Amaranthus stir fry Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  1st Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Amaranthus stir fry by Pravallika Srinivas at BetterButter
తోటకూర బరడby Pravallika Srinivas
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

తోటకూర బరడ వంటకం

తోటకూర బరడ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Amaranthus stir fry Recipe in Telugu )

  • తోటకూర - 1 కట్ట తగినంత
  • పెసరపప్పు - 4 స్పూనులు
  • నూనె - 3 స్పూనులు
  • పోపు దినుసులు - 1 స్పూను
  • పచ్చిమిర్చి చీలికలు - 6
  • కర్వేపాకు - 1 రెమ్మ
  • వెల్లులిరెబ్బలు - 5
  • పచ్చిపప్పు - 1 స్పూను
  • ఇంగువ - 1/4 చిటికెడు
  • ఉప్పు - 1/2 స్పూను
  • పసుపు - 1/4 స్పూను

తోటకూర బరడ | How to make Amaranthus stir fry Recipe in Telugu

  1. తోటకూర వలిచి కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  2. పెసరపప్పు నానపెట్టాలి. మిక్సర్ జార్ లో పెసరపప్పు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
  3. ఒక కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు పచ్చిమిర్చి చీలికలు యండుమిర్చి కర్వేపాకు వెల్లులిరెబ్బలు పచ్చిపప్పు వేసి చిటపటలాడాక ఇంగువ ఉప్పు పసుపు వేసి కలుపుకోవాలి .
  4. తరిగిన తోటకూర పెసరపప్పు మిశ్రమం వేసి బాగా వేపుకోవాలి.
  5. పచ్చివాసన పోయాక కాలాయి నుండి విడిగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  6. అంతే రుచికరమైన తోటకూర బరడ రెడీ..

నా చిట్కా:

అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలి కనుక కొంచం నీరు చల్లుతూ కలుపుకోవాలి.

Reviews for Amaranthus stir fry Recipe in Telugu (0)