హోమ్ / వంటకాలు / బూందీ పాకం

Photo of Boondi burfi by Sukriti Siri at BetterButter
349
3
0.0(0)
0

బూందీ పాకం

Nov-02-2018
Sukriti Siri
15 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బూందీ పాకం రెసిపీ గురించి

బూందీ పాకం సాంప్రదాయిక ఆంధ్రా తీపి వంటకం.బూందీ పాకం ఎంత తేలికగా తయారవుతుందో అంతకు మించి రుచిగా ఉంటుంది పై పెచ్చు ఇది ఎన్నో రోజులు నిలువ ఉంటుంది కూడా.ముందుగానే చేసుకునే గాలి చొరబడని డబ్బాల్లో వేసుకుని నెలంతా ఆరగించవచ్చును.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • పండుగలాగా
 • దక్షిణ భారతీయ
 • ఉడికించాలి
 • వేయించేవి
 • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

 1. 4 కప్పుల : సెనెగపిండి
 2. 2 కప్పుల : మంచి నీరు
 3. 1 గరిటడు : వేడి నూనె
 4. 1/2 చెంచా : పసుపు
 5. 1/4 చెంచా : సన్న ఉప్పు
 6. 1/2 చెంచా : షోడ ఉప్పు
 7. నెయ్యి మరియు నూనె : వేయించటానికి సరిపడా
 8. 2 కప్పుల : ఉండల బెల్లము
 9. 1 కప్పు : మంచి నీరు
 10. 1 చెంచాడు : యాలుకల పొడి
 11. పలుకులు అలంకరించుకోవాటినికి

సూచనలు

 1. సెనెగెపిండి లో ఉప్పు, షోడ ఉప్పు, పసుపు వేసి కలుపుకొని , సన్నని జల్లెడ తో జల్లించుకోండి.
 2. ఒక లోతైన పాత్రలో జల్లించిన పిండిని వేసుకొని ఒక గరిటెడు వేడి వేడి నూనె పోసి పిండికి పట్టేలా కలుపుకోండి.
 3. ఇప్పుడు ఒకటిన్నర నుండి రెండు కప్పుల నీళ్లు నెమ్మదిగా పోసుకుంటూ ఉండలు లేకుండా జరుడుగా ఉండేలా పిండిని కలుపుకోండి.
 4. పది నిముషాలు పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోండి.
 5. వెడల్పాటి మరియు మందపాటి మూకుడులో నూనె మరియు నెయ్యి సమపాళ్లలో బూందీ వేయించటానికి తీసుకొని వేడి చేసుకోండి.
 6. బూందీ గరిటలోకి ఒక్కో గరిటడు పిండిని పోస్తూ గుండ్రపు బూందీని వేసుకోండి.
 7. కరకరలాడే వరకు వేయించుకుని మరో గిన్నెలోకి తీసుకోండి. ఇదే విధముగా కలుపుకున్న పిండంతటిదీ బూందీ కొట్టుకొని పక్కన పెట్టుకోండి.
 8. మరొక మందపాటి ఇత్తడి గిన్నెలో బెల్లం, నీళ్లు తీసుకొని లేత ఉండ పాకం వచ్చే వరకు ఉడికించుకొని యాలుకల పొడి వేసుకొని కలుపుకోండి.
 9. పొయ్యి కట్టేసి బూందీని వేసుకొని పాకం అంత బూందీకి పట్టేలాగా కలుపుకోండి.
 10. రెండు నిమిషాలు అలాగే ఉంచుకొని కాస్త చల్లారనివ్వండి.
 11. ఒక కిస్తీకి నెయ్యి రాసి బూందీ పాకాన్ని అందులోకి ఒంపుకొని గ్లాస్ తో వత్తుకుంటూ సమానంగా పరుచుకొని పసందైన పలుకులు చల్లుకుని పూర్తిగా చల్లారనివ్వండి.
 12. చాకుతో నచ్చినట్లు గా ముక్కలు కట్ చేసుకొని నిలువ చేసుకోండి.
 13. పండుగ రోజుల్లో చేసుకొని మీ సన్నిహితులతో పంచుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర