హోమ్ / వంటకాలు / కజ్జికాయలు గోధుమపిండితో

Photo of Kajjikayalu with wheat flour by Pravallika Srinivas at BetterButter
2043
4
0.0(0)
0

కజ్జికాయలు గోధుమపిండితో

Nov-03-2018
Pravallika Srinivas
30 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కజ్జికాయలు గోధుమపిండితో రెసిపీ గురించి

పండుగ అనగానే మనకు మొదట గుర్తుకు వచ్చేవి స్వీట్స్ .కజ్జికాయలు ఇంట్లో ప్రతినిత్యం ఉండే పదార్దాలతో చాలా త్వరగా చేస్కోవచ్చు. ముఖ్యంగా దసరా పండుగకు ఈ కజ్జికాయలు ఎక్కువ చేస్తుంటారు.తోపు పిండికి సాధారణంగా మైదా వాడుతుంటారు కానీ గోధుమపిండితో చేసిన అంతే కారకరలాడుతున్నాయి.ఇప్పుడు అంటే మనము కోవా కజ్జికాయలు డ్రైఫ్రూప్ట్స్ అని పలు రకాల కజ్జికాయలు చేస్కుంటున్నాం. కానీ అంతకముందు ఇంట్లో ఉండే పల్లీలు పుట్నాలు యండుకొబ్బరి బెల్లం వేసి చేసేవారు. ఇప్పుడు నేను చేయబోయేది వాటితోనే. ఎలా చేయాలో చూసేద్దామా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. గోధుమ పిండి - 1/2 కేజీ
  2. ఉప్పు - 1 స్పూను
  3. నెయ్యి - 100గ్రాములు
  4. నీరు - తగినన్ని
  5. పల్లీలను - 1/4 కేజీ
  6. పుట్నాల పప్పు - 1/4 కేజీ
  7. యండుకొబ్బరి - 2 చిప్పలు
  8. బెల్లం - 1/2 కేజీ
  9. యాలకలు - 10
  10. నూనె - తగినంత

సూచనలు

  1. ముందుగా వెన్న లేదా నెయ్యి కరిగించుకోవాలి.
  2. ఒక బేసన్ లో గోధుమ పిండి ఉప్పు కాచిన నెయ్యి వేసి కలుపుకోవాలి.
  3. పైనుండి తగినన్ని నీరు పోస్తూ పూరి పిండి ముద్దలాగా కలుపుకుని తడిగుడ్డ కప్పి పక్కన పెట్టుకోవాలి.
  4. ఈలోగా పల్లీలను వేయించి పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. పుట్నాల పప్పు కూడా రెడీ గా పెట్టుకోవాలి.
  5. యండుకొబ్బరి చిన్నముక్కలుగా తరిగి వేయించి యాలకలు వేసి పొడి కొట్టుకోవాలి.
  6. బెల్లం ని పొడి కొట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్లో పల్లీలు పుట్నాలు వేసి కొంచం బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
  7. ఇప్పుడు ఒక స్తంభాలం లో గ్రైండ్ చేసిన పొడి పొడి యండుకొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు ఫిల్లింగ్ సిద్ధం.
  8. ఇప్పుడు ముందుగా తయారుచేసిన గోధుమ పిండిని ఒకసారి మర్దన చేసి చిన్న ఉండలు చేసి పూరీలు వత్తుకోవాలి.
  9. ఇప్పుడు కజ్జికాయ మౌల్డ్ తీస్కుని 2 స్పూన్ల పల్లీల మిశ్రమం వేస్కుని చివరలను వేలితో నీరు రాసి క్లోజ్ చేసి ఎక్స్ట్రా గోధుమ పిండిని జాగ్రత్తగా తీసి వేయాలి.
  10. ఇలాగె అన్నింటిని సిద్ధం చేస్కుని కాడాయిలో నూనె వేసి కాగాక కజ్జికాయలు వేసి సన్నని మంట పైన దోరగా వేయించుకోవాలి. అంతే రుచికరమైన కజ్జికాయలు సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర