హోమ్ / వంటకాలు / పుట్నాల పిండి చెక్క

Photo of Roasted chanadal chikki by Pravallika Srinivas at BetterButter
404
3
0.0(0)
0

పుట్నాల పిండి చెక్క

Nov-03-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుట్నాల పిండి చెక్క రెసిపీ గురించి

ఇది పాత కాలం వంట.ఇప్పటి తరానికి తెలియక పోవచ్చు. చాలా తక్కువ మంది చేస్తుంటారు. చాలా తేలిక కూడా. నూనె నెయ్యి అవసరం లేదు. ఇంట్లోనే ఉండే పుట్నాల పప్పు తో చాలా తక్కువ టైం లో చేసే స్వీట్ ఏది. తయారీ విధానం చూసేద్దామా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • మిళితం
  • ఉడికించాలి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. పుట్నాల పప్పు - 500గ్రాములు
  2. పంచదార - 500గ్రాములు
  3. నీరు - పంచదార మునిగేంత
  4. యండుకొబ్బరి - 50 గ్రాములు
  5. యాలుకలపొడి - 1/2 స్పూను
  6. నెయ్యి - 1 స్పూను

సూచనలు

  1. ముందుగా పుట్నాల పప్పుని తీస్కుని మిక్సర్ జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
  2. ఒక కడాయి పెట్టి పంచదార నీరు వేసి కరగనివ్వాలి.
  3. ఒక శుభ్రంగా ఉన్న బండకు నెయ్యి రాసి పెట్టుకోవాలి.
  4. అట్లకాడతో తిప్పుతూ ఉండాలి తీగ పాకం వచ్చాక అంటే కొంచం పాకం తీస్కుని బొటన వేలు చూపుడు వేలు కలిపి విడతీసెటపుడు తీగలాగా రావాలి.
  5. ఇప్పుడు యండుకొబ్బరి యాలుకలపొడి వేసి కలుపుకొని కొంచం కొంచం పుట్నాలపిండి వేసి కలుపుకోవాలి.
  6. మొత్తం వేసాక దగ్గరపడే వరకు ఉడికించుకోవాలి.
  7. ఇప్పుడు దగ్గర పడిన మిశ్రమాన్ని బండమీద వేసి అట్లకాడతో సమానంగా పరుచుకోవాలి. పైన మరికొంచం కొబ్బరిపొడి చల్లుకోవాలి.
  8. కొంచం వేడిమీదనే ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  9. చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకోవాలి. అంతే రుచికరమైన పుట్నాల పిండి చెక్క రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర